అక్షరటుడే, కామారెడ్డి: Student Drowning Kamareddy | కామారెడ్డిలో విషాదం నెలకొంది. చెరువులో ఈతకు (Swimming) వెళ్లిన ఓ విద్యార్థి నీట మునిగి మృతి చెందాడు.
Student Drowning Kamareddy | టేక్రియాల్ గ్రామంలో..
పోలీసులు, గ్రామస్థులు కథనం ప్రకారం.. కామారెడ్డి మున్సిపాలిటీ(Kamareddy Municipality) పరిధిలోని టేక్రియాల్ గ్రామానికి చెందిన కుర్మ రాకేష్ (15) గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో (Government School) 9వ తరగతి చదువుతున్నాడు. ప్రస్తుతం పరీక్షలు కొనసాగుతున్నాయి. అయితే ఆదివారం కావడంతో మరో ఇద్దరు మిత్రులతో కలిసి గొర్లు మేపడానికి వెళ్లారు. మధ్యాహ్నం సమయంలో ఎండ తాకిడికి చెరువులో ఈత కొట్టడానికి ముగ్గురు దిగారు. ఈత కొడుతుండగా ప్రమాదవశాత్తు రాకేష్ చెరువులో ఉన్న గుంతలో ఊపిరాడక మృతి చెందాడు. బాలుడి మృతితో కుటుంబం విషాదంలో మునిగిపోయింది. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. రాకేష్ తల్లి స్వప్న ఫిర్యాదు మేరకు పోలీసులు (Kamareddy Police) కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Kamareddy Inter Results | కామారెడ్డి ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి
