అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Student Exam Tragedy | తండ్రిని కోల్పోయిన బాధలోనూ ఓ విద్యార్థిని పరీక్షకు హాజరైంది. కన్న తండ్రి మృతి చెందిన దు:ఖాన్ని దిగమింగుకొని పదో తరగతి పరీక్ష రాసింది.
నిజామాబాద్ (Nizamabad) నగరానికి చెందిన బీజేపీ (BJP) నాయకుడు, మాజీ కార్పొరేటర్ పంచరెడ్డి సురేష్ (42) బుధవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన కుమార్తె శ్రీనిజ పదో తరగతి చదువుతోంది. ప్రస్తుతం పదో తరగతి వార్షిక పరీక్షలు (SSC Exams) కొనసాగుతున్నాయి. బుధవారం సెకండ్ లాగ్వేజీ ఎగ్జామ్ నిర్వహించారు. శ్రీనిజ తండ్రి చనిపోయినా బాధలోనూ పరీక్షకు హాజరైంది. పరీక్ష రాసిన అనంతరం అంత్యక్రియల్లో పాల్గొంది.
Student Exam Tragedy | కార్పొరేటర్‌గా సేవలు
పంచరెడ్డి సురేష్ కార్పొరేటర్‌గా సేవలు అందించారు. మున్సిపల్ ఎన్నికలకు ముందు ఆయన బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరారు. బీజేపీ నుంచి ఆయన భార్య కార్పొరేటర్‌గా విజయం సాధించారు. సురేష్ మృతిపై పలువురు సంతాపం తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో ఉన్న ఎమ్మెల్యే బుధవారం ఇందూరుకు చేరుకొని ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించారు.
దీనిని కూడా చదవండి : Red Jowar Bonus | ఎర్రజొన్నలకు 500 బోనాస్ ఇవ్వాలి : ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి
