అక్షరటుడే, కామారెడ్డి: Student Snake Bite | ప్రభుత్వ గురుకుల పాఠశాలలు, హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. కొన్ని గురుకుల పాఠశాలలు పాములకు ఆవాసంగా ఉన్నాయన్న ఆరోపణలున్నాయి.
Student Snake Bite | కామారెడ్డి పరిధిలోని సరంపల్లిలో..
తాజాగా మంగళవారం గురుకుల పాఠశాలలో పదో తరగతి విద్యార్థి పాముకాటుకు గురయ్యాడు. ఈ ఘటన కామారెడ్డి (Kamareddy) పరిధిలోని సరంపల్లి గ్రామం వద్ద ఉన్న ఎస్టీ గురుకుల పాఠశాలలో చోటుచేసుకుంది. గాంధారి మండలం (Gandhari Mandal) జెమిని తండాకు చెందిన బానోత్ చరణ్ ట్రైబల్ గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు.
Student Snake Bite | స్టడీ అవర్స్ సమయంలో..
ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు (SSC Exams) కొనసాగుతుండగా విద్యార్థులకు స్టడీ అవర్స్ జరుగుతున్నాయి. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం టీ బ్రేక్ ఇవ్వగా బయటకు వచ్చిన చరణ్‌ను పాఠశాల గ్రౌండ్లో పాము కాటు వేసింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది జీజీహెచ్‌కు తరలించారు. ప్రస్తుతం విద్యార్థి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టుగా తెలుస్తోంది. పరీక్షలు జరుగుతున్న వేళ విద్యార్థి పాముకాటుకు గురికావడంతో విద్యార్థుల్లో భయం నెలకొంది.
ఇది కూడా చదవండి..: Balkonda House Theft | తాళం పగలగొట్టి.. ఇంట్లోకి చొరబడి.. బాల్కొండలో చోరీ!

