అక్షరటుడే, ఎల్లారెడ్డి: Sub Collector Saves Woman | కుటుంబ విభేదాల నేపథ్యంలో ఆత్మహత్యాయత్నం చేసిన ఓ యువతికి కౌన్సెలింగ్ చేసి బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మాయి ప్రాణాలు కాపాడారు. ఈ ఘటన మహమ్మద్‌నగర్ మండలంలోని బుర్గల్ గ్రామం (Burgal Village)లో గురువారం రాత్రి చోటు చేసుకుంది.
Sub Collector Saves Woman | మహమ్మద్‌నగర్..
మహమ్మద్‌నగర్ మండలం (Muhammadnagar Mandal) బుర్గల్ గ్రామానికి చెందిన ఓ యువతి గురువారం రాత్రి కుటుంబ కలహాల నేపథ్యంలో మనస్తాపానికి గురైంది. ఈ నేపథ్యంలో గ్రామంలోని 60 అడుగుల ఎత్తైన వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేసింది. గ్రామస్థులు, కుటుంసభ్యులు ఎంత సముదాయించినప్పటికీ ఆమె ట్యాంక్ కిందికి దిగి రాలేదు. ఈ ఘటన గ్రామంలో కలకలం రేపింది.

Sub Collector Saves Woman | చురుకుగా స్పందించిన సబ్ కలెక్టర్..
సమాచారం అందుకున్న సబ్ కలెక్టర్ కిరణ్మయి (Sub-Collector Kiranmayi) రాత్రివేళ వెంటనే ఆ గ్రామానికి వెళ్లారు. యువతి వాటర్ ట్యాంక్ ఎక్కిన ప్రదేశానికి వెళ్లి స్థానిక పోలీసులు, ఫైర్‌స్టేషన్ సిబ్బందితో మాట్లాడారు. సదరు యువతి ఎవరు చెప్పిన వినకపోవడంతో స్వయంగా సబ్ కలెక్టర్ వాటర్ ట్యాంక్ ఎక్కారు. ట్యాంక్‌పైకి ఎక్కి యువతికి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆమె సమస్యను ఓపికగా విని ఓదార్చారు. అనంతరం సదరు యువతి సురక్షితంగా కిందికి దిగేలా కృషి చేశారు. దీంతో కుటుంబీకులు, గ్రామస్థులు, పోలీస్, ఫైర్‌స్టేషన్ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. సబ్ కలెక్టర్ చూపిన చొరవ, సమయస్ఫూర్తిని గ్రామస్థులు ప్రశంసించారు.
ఇది కూడా చదవండి..: Ugadi Celebrations | నూతన ఆశలతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుదాం : ఎస్పీ రాజేష్ చంద్ర

