అక్షరటుడే, వెబ్‌డెస్క్: Subsidy on Power | పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా దేశంలో వంటగ్యాస్ సరఫరాపై ఆందోళన నెలకొంది. వాణిజ్య సిలిండర్ల కొరత కారణంగా అనేక ప్రాంతాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు తాత్కాలికంగా క్లోజ్ అవుతున్నాయి. ముంబయి, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో హోటళ్లు మూతపడుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Subsidy on Power | రాయితీ పథకం..
కమర్షియల్ సిలిండర్లకు బదులుగా విద్యుత్ స్టవ్‌లను వినియోగించే రెస్టారెంట్లు, హోటళ్లు, చాయ్ షాపులకు విద్యుత్‌పై యూనిట్‌కు రూ.2 చొప్పున రాయితీ ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ఎల్పీజీ పరిస్థితులపై ఆ రాష్ట్ర ప్రభుత్వం సమీక్ష నిర్వహించింది. హోటళ్లు, రెస్టారెంట్లు, చాయ్ దుకాణాలు, క్లౌడ్ కిచెన్‌ల కోసం ఇండక్షన్ స్టవ్‌ల ఉపయోగించినట్లయితే వచ్చే అదనపు విద్యుత్ బిల్లుపై యూనిట్‌కు రూ.2 చొప్పున సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.
Subsidy on Power | కేంద్రం పరిమితులు అమలులో ఉన్నవరకు..
కమర్షియల్ సిలిండర్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పరిమితులు అమలులో ఉన్నంత కాలం సబ్సిడీ వర్తిస్తుందని తమిళనాడు అధికారులు వెల్లడించారు. గత కొద్దిరోజులుగా హోటళ్లు, రెస్టారెంట్లలో విద్యుత్ వినియోగం పెరిగిందని పేర్కొన్నారు. అలాగే విద్యుత్ డిమాండ్ యావరేజ్ కన్నా సుమారు 50 మెగావాట్లు అధికమైందని తెలిపారు.
STORY | TN govt announces Rs 2 per unit power subsidy to eateries switching to induction stoves
The Tamil Nadu government on Saturday announced a subsidy of Rs 2 per unit of electricity for restaurants, hotels and tea shops that switch to electric stoves instead of commercial… pic.twitter.com/jdpNaleyL0
— Press Trust of India (@PTI_News) March 14, 2026
Subsidy on Power | వాటికి కొరత లేకుండా కేంద్రం చర్యలు
పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో కమర్షియల్ సిలిండర్లపై కేంద్రం ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అయితే డొమెస్టిక్ సిలిండర్లపై ఎలాంటి ఆంక్షలు విధించలేదు. అయితే కేవలం బుకింగ్ గడువును మాత్రం కాస్త పెంచింది. అంతేకాకుండా ఆస్పత్రులు, విద్యాసంస్థలు వంటి అత్యవసర నాన్‌డొమెస్టిక్ రంగాలకు ప్రాధాన్యం ఇచ్చి వీటికి గ్యాస్ సరఫరాను కొనసాగించాలని నిర్ణయించింది.
ఇది కూడా చదవండి..: Modi Congress Criticism | విదేశీ శక్తుల చేతుల్లో కాంగ్రెస్.. ప్రధాని మోదీ విమర్శలు

