Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Sudarshan Reddy Polytechnic Initiative | పాలిటెక్నిక్ కళాశాలలను సద్వినియోగం చేసుకోవాలి: ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Sudarshan Reddy Polytechnic Initiative | పాలిటెక్నిక్ కళాశాలలను సద్వినియోగం చేసుకోవాలి: ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి

నిజామాబాద్

Sudarshan Reddy Polytechnic Initiative | పాలిటెక్నిక్ కళాశాలలను సద్వినియోగం చేసుకోవాలి: ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి

ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఊతమందించే పాలిటెక్నిక్ కళాశాలను విద్యార్థులు, యువత పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పిలుపునిచ్చారు.

Srinivas kolluri
Last updated: మార్చి 25, 2026 5:07 సా.
Srinivas Kolluri
2 రోజులు ago
Share
Sudarshan Reddy Polytechnic Initiative

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Sudarshan Reddy Polytechnic Initiative | ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఊతమందించే పాలిటెక్నిక్ కళాశాలను విద్యార్థులు, యువత పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పిలుపునిచ్చారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi)తో కలిసి బుధవారం ఆయన నవీపేటలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను సందర్శించారు.

Contents
  • Sudarshan Reddy Polytechnic Initiative | ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందించేందుకు..
    • Sudarshan Reddy Polytechnic Initiative | నీటి ఎద్దడి లేకుండా చర్యలు..
      • Sudarshan Reddy Polytechnic Initiative | ఆయిల్​ పామ్​ ఫ్యాక్టరీ..

Sudarshan Reddy Polytechnic Initiative | ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందించేందుకు..

యువతకు తక్షణ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాలనే తపనతో జిల్లాలో విరివిగా పాలిటెక్నిక్ కాలేజీ (Polytechnic College)లను ఏర్పాటు చేయడం జరిగిందని సుదర్శన్​ రెడ్డి అన్నారు. అయితే విద్యార్థులు తగిన విధంగా ప్రవేశాలు పొందడం లేదని, ఈ కళాశాల గురించి విస్తృత స్థాయిలో అవగాహన పెంపొందించాలని అధికారులను ఆదేశించారు. గడిచిన నాలుగేళ్లలో పాలిటెక్నిక్ కోర్సులు చేసిన అనేక మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయని గుర్తు చేశారు. ప్రస్తుతం నవీపేట కళాశాల (Navipet College)లో సివిల్, మెకానికల్ విభాగాలు కొనసాగుతున్నాయని, వచ్చే విద్యా సంవత్సరం నుండి రోబోటిక్స్, కంప్యూటర్ సైన్స్ కోర్సులు సైతం అందుబాటులోకి రానున్నాయని అన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు, యువత వినియోగించుకోవాలని హితవు పలికారు.

Sudarshan Reddy Polytechnic Initiative | నీటి ఎద్దడి లేకుండా చర్యలు..

ప్రస్తుత వేసవిలో జిల్లాలో ఎక్కడ కూడా నీటి ఎద్దడి తలెత్తకుండా అధికారులను సన్నద్ధం చేశామని ప్రభుత్వ సలహాదారు అన్నారు. ప్రజలు కూడా సకాలంలో మున్సిపాలిటీలకు, గ్రామ పంచాయతీలకు పన్నులు చెల్లిస్తూ సదుపాయాలను మెరుగుపర్చేందుకు సహకరించాలని కోరారు. ప్రజల ఆరోగ్యాల పరిరక్షణకు ఎనలేని ప్రాధాన్యత ఇస్తున్నామని, కల్తీ ఆహార పదార్థాల తయారీ, విక్రయాలపై నిఘా ఉంచాలని సంబంధిత శాఖలకు సూచించామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసేందుకు వీలుగా లబ్దిదారులకు అవసరమైన తోడ్పాటును అందిస్తున్నామని, ఇసుక, మొరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని అన్నారు.

Sudarshan Reddy Polytechnic Initiative | ఆయిల్​ పామ్​ ఫ్యాక్టరీ..

నిజామాబాద్ (Nizamabad), నిర్మల్ జిల్లాలకు కలిపి ఆయిల్ పామ్ ఫాక్టరీని ప్రభుత్వం కేటాయించినందున, అనువైన స్థలం కోసం పరిశీలన జరుపుతున్నామని, ఈ ప్రాంత రైతాంగ ప్రయోజనాల కోసం సాధ్యమైనంత త్వరగా ఫాక్టరీని ఏర్పాటయ్యేలా కృషి చేస్తున్నామని సుదర్శన్​ రెడ్డి అన్నారు. ప్రభుత్వ సలహాదారు వెంట రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ ఛైర్మన్ మానాల మోహన్ రెడ్డి, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ గంగాధర్, సందీప్ తదితరులు ఉన్నారు.

ఇది కూడా చదవండి..: BLO Absence Issue | బీఎల్​వోల గైర్హాజరుపై కలెక్టర్​ ఆగ్రహం

Nizamabad CP Inspection | నగరంలో అర్ధరాత్రి పర్యటించిన సీపీ సాయిచైతన్య
Kamareddy Chairperson Election | కామారెడ్డి ఛైర్​పర్సన్​ ఎన్నిక చెల్లదు.. కోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్​ కౌన్సిలర్​ అభ్యర్థి
Sanitation Workers Felicitation | పారిశుధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి
Women Teachers Support | మహిళా ఉపాధ్యాయులకు అండగా ప్రభుత్వం: ప్రభుత్వ సలహాదారు సుదర్శన్​ రెడ్డి
Telangana Education Commission | విద్యా కమిషన్ ఇచ్చిన సిఫార్సులు అశాస్త్రీయం..: టీపీటీఫ్​
TAGGED:Collector Ila Tripathieducation initiativesemployment opportunitiesNavipet CollegeNizamabadNizamabad NewsPolytechnic CollegeSkill DevelopmentSudarshan Reddy Polytechnic InitiativeTelangana Education
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Surender Birthday Celebrations Surender Birthday Celebrations | ఘనంగా మాజీ ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్ జన్మదిన వేడుకలు
Next Article Dhannapal Indiramma houses Dhannapal Indiramma houses | నిజామాబాద్​లో ఒక్క డబుల్ బెడ్​రూం ఇల్లు కూడా ఇవ్వలేదు: ఎమ్మెల్యే ధన్​పాల్
2 వ్యాఖ్యలు
  • పింగుబ్యాకు: Dhannapal Indiramma houses| ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇవ్వలేదు
  • పింగుబ్యాకు: Congress Party Positions | కాంగ్రెస్​పార్టీలో కష్టపడి..

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?