అక్షరటుడే, బోధన్: Sudharshan Reddy Dance | బోధన్‌లో సంత్ సేవాలాల్ జయంతిని (sant sevalal jayanti) ఘనంగా నిర్వహించారు. పట్టణ శివారులోని బంజారా భవన్ కోసం కేటాయించిన స్థలంలో ఏర్పాటుచేసిన వేడుకల్లో ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి (MLA sudharshan reddy) పాల్గొన్నారు.
Sudharshan Reddy Dance | అన్నివర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం (Nizamabad News) అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం కట్టుబడి ఉందన్నారు. గత ప్రభుత్వం ఆలయంలో అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం జరిగిందని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో బంజారాలకు (banjara festival) పెద్దపీట వేస్తున్నామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన రెండున్నరేళ్లలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు, పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, మహిళా సంఘాలకు రుణాలు, మహిళలకు మహాలక్ష్మి పథకం ఇలా అనేక కార్యక్రమాలు విజయవంతంగా అమలవుతున్నాయన్నారు. ప్రతిపక్షాలు తమ పబ్బం గడుపుకునేందుకు ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయన్నారు. అనంతరం బంజారాలతో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, మున్సిపల్ ఛైర్పర్సన్ పద్మ స్టెప్పులు వేసి ఆడి పాడారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు నగేష్‌రెడ్డి, గ్రంథాలయ ఛైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, నుడా ఛైర్మన్ వేణు తదితరులు పాల్గొన్నారు.


ఇది కూడా చదవండి: Legislative Council Building | శాసన మండలి భవనం ప్రారంభం
sudharshan reddy bodhan, sant sevalal jayanti, banjara community event, bodhan political news, telangana congress leaders, cultural celebrations telangana, bodhan mla news, banjara festival celebration

