Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Sugar Daddy Parties | బెంగళూరులో ‘షుగర్ డాడీ–షుగర్ బేబీ’ పార్టీలు.. గ్యాంగ్‌రేప్ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి…
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Sugar Daddy Parties | బెంగళూరులో ‘షుగర్ డాడీ–షుగర్ బేబీ’ పార్టీలు.. గ్యాంగ్‌రేప్ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి…

జాతీయంతాజా వార్తలు

Sugar Daddy Parties | బెంగళూరులో ‘షుగర్ డాడీ–షుగర్ బేబీ’ పార్టీలు.. గ్యాంగ్‌రేప్ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి…

బెంగళూరు రేప్​ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా తెరపై షుగర్​ డాడీ.. షుగర్​ బేబీ పార్టీలు వెలుగు చూడటం తీవ్ర చర్చకు దారితీసింది.

Naresh chandan
Last updated: మార్చి 5, 2026 9:22 ఉద.
Naresh chandan
3 వారాలు ago
Share
Sugar Daddy Parties | బెంగళూరులో ‘షుగర్ డాడీ–షుగర్ బేబీ’ పార్టీలు.. గ్యాంగ్‌రేప్ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి…
Sugar Daddy Parties | బెంగళూరులో ‘షుగర్ డాడీ–షుగర్ బేబీ’ పార్టీలు.. గ్యాంగ్‌రేప్ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి…

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Sugar Daddy Parties | బెంగళూరులో జరిగిన గ్యాంగ్‌రేప్ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. సంచలన విషయాలు చూస్తున్నాయి. జక్కూర్‌లోని ఓ విల్లాలో 19 ఏళ్ల యువతిపై గ్యాంగ్​ రేప్​ జరిగినట్లు ఆరోపణలు ఉన్న కేసును విచారిస్తుండగా.. బెంగళూరులోని పలు విల్లాలు, స్టార్ హోటళ్లలో “షుగర్ డాడీ–షుగర్ బేబీ” పేరుతో ప్రత్యేక పార్టీలు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇందుకు నెట్‌వర్క్ ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఈ పార్టీల ద్వారా యువతులను మోసం చేసి.. శారీరకంగా లోబర్చుకోవడం, తర్వాత బ్లాక్‌మెయిల్ చేసే అతి పెద్ద రాకెట్ ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.

Contents
  • Sugar Daddy Parties | ప్రత్యేక కోడ్ పదాలు
    • Sugar Daddy Parties | పోలీస్ అధికారికి చెందిన విల్లా..
      • Sugar Daddy Parties | హనీట్రాప్​ కేసు..

Sugar Daddy Parties | ప్రత్యేక కోడ్ పదాలు

తాజా రేప్​ కేసులో బసవేశ్వరనగర్‌కు చెందిన నిఖిల్ అనే వ్యక్తిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. అతగాడే ఈ ప్రత్యేక పార్టీలు నిర్వహిస్తున్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఈ పార్టీలకు ప్రత్యేక కోడ్ పదాలు ఉపయోగిస్తున్నట్లు సమాచారం. 25 వయస్సు ఏళ్ల లోపు యువతులను “షుగర్ బేబీస్”గా.. 45 ఏళ్లకు పైబడిన మగవారిని “షుగర్ డాడీస్”గా పిలుస్తున్నట్లుగా తెలుస్తోంది.. వీరికి ముందుగా ఇచ్చే పాస్‌వర్డ్‌ల ద్వారా మాత్రమే ప్రత్యేక పార్టీల్లోకి ప్రవేశం కల్పించేవారని పోలీసులు చెబుతున్నారు.

యువతులను పెద్ద మొత్తంలో డబ్బు, అతి ఖరీదైన బహుమతులు, లగ్జరీ జీవితం ఆశ చూపి ఈ ప్రత్యేక పార్టీలకు ఆహ్వానించేవారని తెలుస్తోంది. కొన్నిసార్లు పానీయాల్లో మత్తు మందు కలిపి లైంగిక దాడులకు పాల్పడినట్లు అనుమానాలు ఉన్నాయి. లైంగిక దాడి వీడియోలు, ఫొటోలు తీసి, బాధితులను బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు లాగేవారని, మళ్లీ మళ్లీ లైంగిక దాడికి పాల్పడేవారని సమాచారం.akshara bengaluru

Sugar Daddy Parties | పోలీస్ అధికారికి చెందిన విల్లా..

గ్యాంగ్‌రేప్ ఆరోపణలు ఉన్న జక్కూర్ విల్లా ఒక సీనియర్ పోలీస్ అధికారికి చెందినదిగా నివాసంగా తెలుస్తోంది. దీనిని ఆయన మరొకరికి లీజుకు ఇచ్చారని, సదరు వ్యక్తి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ ద్వారా వేరేవారికి తాత్కాలికంగా అద్దెకు ఇవ్వడంతో నిఖిల్ అనే వ్యక్తి పార్టీ కోసం తీసుకున్నట్లు పోలీసులు వెల్లడిస్తున్నారు. కాగా, రేప్​ ఘటనపై సదరు పోలీస్ అధికారికి తెలియదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.

Sugar Daddy Parties | హనీట్రాప్​ కేసు..

ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ఒక రోజు ముందే..  అమృతహళ్లి పోలీస్ స్టేషన్‌లో నిఖిల్ ఫిర్యాదు చేశాడు. తనను హనీ ట్రాప్ చేసి డబ్బులు దోచుకునే ప్రయత్నం చేసినట్లు ఫిర్యాదులో ఆరోపించాడు. ఇందుకు తన మొబైల్‌లో ఉన్న కొన్ని ఫొటోలను ఆధారంగా చూపించాడు.

కానీ, గ్యాంగ్‌రేప్ కేసులో అరెస్టు చేసే సమయంలో నిఖిల్ మొబైల్ కనిపించకపోవడం గమనార్హం. తన మొబైల్​ను మరమ్మతులకు ఇచ్చినట్లు అతగాడు చెప్పినట్లు సమాచారం. కాగా, గ్యాంగ్​ రేప్​ కేసులో ఐదుగురు  నిందితుల ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సదరు మొబైల్స్​లోని వాట్సాప్ చాట్‌లు, కాల్ రికార్డులను పరిశీలిస్తున్నారు.

ఇలాంటి పార్టీలు ఇంకా ఎన్నిచోట్ల జరుగుతున్నాయి..?  బాధితులు మరింత మంది ఉన్నారా..? అనే కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఇప్పటివరకు ఏడుగురు సాక్షుల వాంగ్మూలాలను పోలీసులు నమోదు చేసినట్లు తెలిసింది. ఈ పార్టీల నిర్వహణలో ఇంకెవరైనా భాగస్వాములుగా ఉన్నారా..? అనే కోణంలోనూ విచారణ కొనసాగిస్తున్నారు.

గ్యాంగ్​ రేప్​ కేసు దర్యాప్తును బెంగళూరు పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్ నేరుగా పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. డిజిటల్, ఫోరెన్సిక్ ఆధారాల ద్వారా మరికొన్ని అరెస్టులు చేపట్టే అవకాశముందని బెంగళూరు పోలీసులు చెబుతున్నారు.

 

West Asia Tensions | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై మంత్రి జైశంకర్​ ప్రకటన
Ali Khamenei Death | ఖమేనీ మరణంపై ఇరాన్​ స్పందన.. అమెరికా, ఇజ్రాయెల్​ స్థావరాలపై భయంకరమైన దాడులు చేస్తామని హెచ్చరిక
LPG Booking Rules | సిలిండర్‌ బుకింగ్‌ రూల్స్‌ మరింత కఠినతరం!
Rupee All Time Low | భారీగా రూపాయి పతనం.. ఆల్‌టైం కనిష్ఠానికి చేరిన మారకం విలువ
Kavitha Hunger Strike | కవితకు కొడుకు అండ.. చదువుకునే వయసులోనే రాజకీయాలపై ఫోకస్!
TAGGED:Bengaluru CrimeBengaluru PoliceCrime InvestigationGangrape CaseIndia crime newsSugar Daddy PartiesVilla Party RacketWomen Safety
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Global Stock Markets | పాజిటివ్‌గా గ్లోబల్ మార్కెట్లు.. Global Stock Markets | పాజిటివ్‌గా గ్లోబల్ మార్కెట్లు..
Next Article Finn Allen 33 Ball Century Finn Allen 33 Ball Century | ఈడెన్ గార్డెన్స్‌లో కివీస్ తుపాను ఇన్నింగ్స్.. మ‌ళ్లీ ‘ఛోకర్స్’గా సౌతాఫ్రికా
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?