Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Suicide Drones | భారత ఆర్మీ చేతికి భారీగా సూసైడ్‌ డ్రోన్లు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Suicide Drones | భారత ఆర్మీ చేతికి భారీగా సూసైడ్‌ డ్రోన్లు

జాతీయం

Suicide Drones | భారత ఆర్మీ చేతికి భారీగా సూసైడ్‌ డ్రోన్లు

భారత ఆర్మీ చేతికి భారీగా సూసైడ్‌ డ్రోన్లు చేరాయి. సూరత్‌కు చెందిన స్టార్టప్‌ కంపెనీ వీటిని రూపొందించింది.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 7, 2026 2:24 సా.
Srinivas Kolluri
1 రోజు ago
Share
Suicide Drones

అక్షరటుడే, వెబ్​డెస్క్: Suicide Drones | భారత అమ్ముల పొదిలో మరిన్ని అస్త్రాలు చేరాయి. వందలాది సూసైడ్ డ్రోన్లను సూరత్‌ (Surat)కు చెందిన స్టార్టప్‌ కంపెనీ ఆర్మీకి అప్పగించింది. ఇన్‌సైడ్‌ఎఫ్‌పీవీ సంస్థతో రక్షణశాఖ గత డిసెంబర్‌లో రూ.10 కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా రెండు నెలల్లోనే ఆ కంపెనీ కామికేజ్‌ డ్రోన్లను ఆర్మీకి అప్పగించింది.

Contents
  • Suicide Drones | 120 కి.మీ. వేగంతో..
    • Suicide Drones | జీపీఎస్​ లేకున్నా..

ప్రస్తుతం యుద్ధతంత్రం మారింది. క్షిపణులు, డ్రోన్లు యుద్ధాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యంగా తక్కువ వ్యయంతో నిర్మించిన సూసైడ్​ డ్రోన్లు శత్రువులకు భారీగా నష్టం చేస్తున్నాయి. ఈ క్రమంలో భారత్​ వాటిని సమకూర్చుకోవాలని భావించింది. ఇందులో భాగంగా గుజరాత్‌ (Gujarat)కు చెందిన ఒక డీప్-టెక్ డ్రోన్ కంపెనీతో గతంలో ఒప్పందం చేసుకుంది. సూరత్‌కు చెందిన ఇన్‌సైడ్‌ఎఫ్‌పీవీతో గత ఏడాది డిసెంబర్‌లో ఈ కాంట్రాక్టు కుదిరింది. అత్యవసర సేకరణ మార్గం ద్వారా రెండు నెలల్లోనే డ్రోన్లను సైన్యానికి అందజేశారు.

Suicide Drones | 120 కి.మీ. వేగంతో..

ఈ డ్రోన్లు గరిష్టంగా 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు. రియల్-టైమ్ టార్గెటింగ్‌తో టార్గెట్​ను ధ్వంసం చేస్తాయి. కచ్చితమైన దాడుల కోసం AI-ఆధారిత మార్గనిర్దేశం వ్యవస్థ వీటిలో ఉంది. గరిష్టంగా 2.5 కిలో మీటర్ల ఎత్తులో ఎగరగలవు. 2.5 కిలోల పేలోడ్​ను మోసుకెళ్లగలవు. కచ్చితత్వంతో పేలోడ్‌ను చేరవేసే సర్జికల్ స్ట్రైక్ ఆపరేషన్లలో (Surgical Strike Operations) ఇవి కీలకంగా మారనున్నాయి.

Suicide Drones | జీపీఎస్​ లేకున్నా..

ఫస్ట్ పర్సన్ వ్యూ (FPV), కమికాజీ డ్రోన్‌లలో GPS అందుబాటులో లేని జోన్‌లు, కఠినమైన వాతావరణాలలో పనిచేయడానికి రూపొందించిన సిస్టమ్‌లను అభివృద్ధి చేస్తుంది. FPV డ్రోన్‌లను ప్రత్యేకమైన గాగుల్స్ ఉపయోగించి ఆపరేట్ చేస్తారు. ఇవి మైనస్​ 35 డిగ్రీల ఉష్ణోగ్రతలలో కూడా పని చేయగలవు. ఈ ఒప్పందం దేశీయ రక్షణ తయారీ రంగం వైపు జరుగుతున్న విస్తృత ప్రోత్సాహాన్ని ప్రతిబింబిస్తుంది. కచ్చితమైన మానవరహిత వ్యవస్థలను వేగంగా, పెద్ద ఎత్తున అందించగల సామర్థ్యం ఉన్న స్వదేశీ సంస్థలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది.

ఇది కూడా చదవండి..: Ladakh Donation Auctions | గుడ్డు రూ. 6 వేలు.. ఆపిల్ రూ. 1.05 లక్షలు..

Gas Shortage Ayodhya | గ్యాస్​ కొరతతో అయోధ్యలో నిలిచిన ప్రసాదం పంపిణీ
Joint Tax Filing | దంపతుల కోసం జాయింట్ ట్యాక్స్ ఫైలింగ్ తేవాలి.. రాజ్యసభలో రాఘవ్ చద్దా!
Narhari Zirwal Video | ట్రాన్స్​జెండర్​తో మంత్రి రాసలీలలు.. వీడియో వైరల్!
KA Paul War Statement | యుద్ధాన్ని వెంటనే ఆపాలి : కేఏ పాల్
UDAN Scheme Expansion | వికసిత్ భారత్ కు ‘ఉడాన్’ ఊతం!.. మరో 100 విమానాశ్రయాల నిర్మాణం వైపు అడుగులు
TAGGED:AI targetingdefense technologydomestic defenseFPV dronesGujaratIndia Armyprecision strikeSuicide DronesSuratSurat startupSurgical Strike Operations
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Mojtaba Khamenei Coma Mojtaba Khamenei Coma | కోమాలో ఇరాన్​ సుప్రీం లీడర్​ మోజ్తాబా ఖమేనీ?
Next Article Liquor Ban Resolution Liquor Ban Resolution | బెల్టు షాపు నిర్వహణ పుకార్లకు చెక్.. మద్యం విక్రయాలు నిషేధిస్తూ రాఘవాపూర్ గ్రామస్థుల తీర్మానం
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?