Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Sukhoi Su-30 Crash | కూలిపోయిన సుఖోయ్​ యుద్ధ విమానం.. ఇద్దరు పైలెట్ల మృతి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Sukhoi Su-30 Crash | కూలిపోయిన సుఖోయ్​ యుద్ధ విమానం.. ఇద్దరు పైలెట్ల మృతి

జాతీయం

Sukhoi Su-30 Crash | కూలిపోయిన సుఖోయ్​ యుద్ధ విమానం.. ఇద్దరు పైలెట్ల మృతి

అస్సాంలోని కర్బి ఆంగ్లాంగ్ జిల్లాలో సుఖోయ్ యుద్ధ విమానం కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు పైలెట్లు మృతి చెందారు.

Srinivas kolluri
Last updated: మార్చి 6, 2026 3:11 సా.
Srinivas Kolluri
3 వారాలు ago
Share
Sukhoi Su-30 Crash
Sukhoi Su-30 Crash

అక్షరటుడే, వెబ్​డెస్క్: Sukhoi Su-30 Crash | అస్సాంలోని కర్బి ఆంగ్లాంగ్ జిల్లా (Karbi Anglong District)లో గురువారం రాత్రి సుఖోయ్ సు-30 ఎంకేఐ ఫైటర్ జెట్ కూలిపోవడంతో ఇద్దరు భారత వైమానిక దళ (ఐఏఎఫ్) పైలట్లు మరణించారు. పైలట్లను స్క్వాడ్రన్ లీడర్ అనుజ్, ఫ్లైట్ లెఫ్టినెంట్ పూర్వేష్ దురాగ్కర్‌గా గుర్తించినట్లు వైమానిక దళం తెలిపింది.

Contents
  • Sukhoi Su-30 Crash | కొద్దిసేపటికే..
    • Sukhoi Su-30 Crash | విషాదకరం
      • Sukhoi Su-30 Crash | దీర్ఘ శ్రేణి ఫైటర్​ జెట్

అసోంలో భారత వాయుసేన (Indian Air Force)కు చెందిన కీలకమైన సుఖోయ్‌ యుద్ధ విమానం గురువారం గల్లంతు అయిన విషయం తెలిసిందే. వైమానిక ప్రాంతంలో శిక్షణ కొనసాగుతున్న సమయంలో విమానం రాడార్‌ కాంటాక్ట్‌ నుంచి అకస్మాత్తుగా మిస్​ అయినట్లు అధికారులు తెలిపారు. అప్రమత్తమైన భారత వాయుసేన సదరు విమానం కోసం గాలింపు చర్యలు చేపట్టగా.. కూలిపోయినట్లు గుర్తించింది. ఐఏఎఫ్ సిబ్బంది అందరూ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ దుఃఖ సమయంలో మృతుల కుటుంబానికి అండగా ఉంటామని ఎక్స్​ వేదికగా ఇండియన్​ ఎయిర్​ ఫోర్స్​ (Indian Air Force) పోస్ట్ చేసింది.

Sukhoi Su-30 Crash | కొద్దిసేపటికే..

సుఖోయ్​– 30 ఎంకేఐ విమానం శిక్షణ సమయంలో కూలిపోయింది. జోర్హాట్ వైమానిక స్థావరం నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే అదృశ్యమైంది. అది కూలిపోయిన ప్రదేశం నుంచి దాదాపు 60 కి.మీ. దూరంలో ఉంది. ఈ విమానం సాయంత్రం 7:42 గంటలకు కమ్యూనికేషన్ కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. మారుమూల కొండ ప్రాంతంలో కూలిపోయినట్లు తెలిసింది. కొండ నుంచి పెద్ద పేలుడు శబ్దం వినిపించిందని స్థానికులు తెలిపారు.

Sukhoi Su-30 Crash | విషాదకరం

సుఖోయ్ విమాన ప్రమాదంపై రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ స్పందించారు. ప్రమాదంలో ఇద్దరు పైలట్లు మరణించడం పట్ల తాను “తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను” అని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ (Minister Rajnath) సింగ్ అన్నారు. వారి ధైర్యం, దేశానికి చేసిన సేవ ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటుందన్నారు. ఈ సమయంలో దేశం వారికి దేశం అండగా నిలుస్తుందన్నారు.

Sukhoi Su-30 Crash | దీర్ఘ శ్రేణి ఫైటర్​ జెట్

సు-30 ఎంకేఐ అనేది రష్యన్ విమానాల తయారీదారు సుఖోయ్ అభివృద్ధి చేసిన రెండు సీట్ల, దీర్ఘ-శ్రేణి ఫైటర్ జెట్. దీనిని ఇప్పుడు ప్రభుత్వ రంగ ఏరోస్పేస్ మేజర్ హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) IAF లైసెన్స్ కింద నిర్మించింది. ఈ విమానం మొదటిసారిగా 1997లో భారత వైమానిక దళంలో చేరింది. జూన్ 2024లో మహారాష్ట్రలోని నాసిక్‌లో సుఖోయ్ యుద్ధ విమానం కూలిపోయింది. 2023 జనవరిలో సైతం సుఖోయ్-30 జెట్ కూలిపోయింది.

ఇది కూడా చదవండి..: Sukhoi Fighter Jet | అసోంలో సుఖోయ్‌ యుద్ధ విమానం గల్లంతు.. ఎయిర్‌ఫోర్స్‌ ముమ్మర గాలింపు

Central Cabinet Decisions | కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. రూ.33 వేల కోట్లతో భవ్య పథకం
Rupee All Time Low | భారీగా రూపాయి పతనం.. ఆల్‌టైం కనిష్ఠానికి చేరిన మారకం విలువ
Farooq Abdullah Attack | ఫరూక్ అబ్దుల్లాపై హత్యాయత్నం.. జెడ్ ప్లస్ భద్రతతో త్రుటిలో తప్పిన ప్రమాదం
SIM Binding Implementation | నేటి నుంచి సిమ్​ బైండింగ్​.. మొబైల్​ వినియోగంలో కఠిన నిబంధన!
India Petrol Shortage | దేశంలో పెట్రోల్‌ కొరత లేదు.. కేంద్రం కీలక ప్రకటన
TAGGED:Assam Newsfighter jet accidentIAF crashIndian Air ForceKarbi Anglong Districtmilitary aviationMinister Rajnathpilot deathSukhoi aircraftSukhoi Su-30Sukhoi Su-30 Crash
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Tirumala Forest Fire Tirumala Forest Fire | తిరుమల కొండల్లో కార్చిచ్చు..
Next Article UPSC Civil Services Results UPSC Civil Services Results | సివిల్ సర్వీసెస్​ ఫలితాల విడుదల
2 వ్యాఖ్యలు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?