అక్షరటుడే, వెబ్‌డెస్క్: Summer Hailstorms | వేసవి కాలం మొదలైందంటే చాలు భానుడి భగభగలు, ఉక్కపోతతో జనం ఇబ్బంది పడుతుంటారు. అయితే, ఈ కాలంలోనే అకస్మాత్తుగా వాతావరణం చల్లగామారి వడగళ్ల వానలు కురవడం మనం చూస్తుంటాం.
అసలు ఎండలు తీవ్రంగా ఉన్నప్పుడే ఈ మంచు ముక్కలు ఆకాశం నుంచి ఎందుకు పడతాయనే సందేహం చాలా మందిలో కలుగుతుంది. దీని వెనుక బలమైన వాతావరణ కారణాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Summer Hailstorms | ఉష్ణోగ్రత ప్రభావం:
సాధారణంగా వడగళ్ల వర్షం కురవడానికి నేల మీద ఉండే అధిక ఉష్ణోగ్రత ప్రధాన కారణం. మార్చి నెల నుంచి ఎండల తీవ్రత పెరగడం వల్ల భూమి వేడెక్కుతుంది. ఈ వేడి కారణంగా భూమిపై ఉండే గాలి వేడెక్కి పైకి ప్రయాణిస్తుంది. ఎండాకాలంలో ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుతాయి కాబట్టి, జూన్ చివరి వరకు వడగళ్ల వానలు పడటానికి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి.
Summer Hailstorms | క్యుములోనింబస్ మేఘాల పాత్ర:
వేసవిలో భూమిపై వేడి అధికంగా ఉన్నప్పుడు, సముద్రపు గాలుల ప్రభావంతో ‘క్యుములోనింబస్’ అనే ప్రత్యేకమైన మేఘాలు ఏర్పడతాయి. ఇవి సాధారణ మేఘాల కంటే చాలా ఎత్తుకు చేరుకుంటాయి. వాతావరణంలోని పై పొరల్లో ఉండే అత్యల్ప ఉష్ణోగ్రతల వద్ద ఈ మేఘాల్లోని నీటి బిందువులు మంచు గడ్డలుగా మారుతాయి. ఇవి ఒకదానికొకటి ఢీకొన్నప్పుడు లేదా భారమైనప్పుడు ముక్కలుగా విడిపోయి కిందకు పడతాయి.
మంచు ముక్కలు ఎందుకు కరిగిపోవు?
మేఘాల నుంచి మంచు ముక్కలు భూమికి వచ్చే క్రమంలో వాతావరణంలో ఉండే వేడి వల్ల కొంతవరకు కరిగిపోతాయి. అయితే, వేగంగా కిందకు పడటం వల్ల, మేఘాల ఎత్తు ఎక్కువగా ఉండటం వల్ల అవి పూర్తిగా కరగకముందే వడగళ్ల రూపంలో భూమిని చేరుతాయి. కేవలం వేసవిలో మాత్రమే ఈ క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉండటం వల్ల, శీతాకాలం కంటే ఎండాకాలంలోనే వడగళ్ల వర్షాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి.
ఇది కూడా చదవండి: Good Luck Signs | అదృష్టం వరించే ముందు వచ్చే సంకేతాలివే.. ఇంట్లో ఇవి కనిపిస్తే ఇక తిరుగులేనట్టే!

