Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Summer Health Tips | మండుతున్న ఎండలు.. జాగ్రత్తలు పాటించకుంటే ప్రాణాపాయం: డాక్టర్​ ఆనంద్​ మాలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

లైఫ్​స్టైల్​ - Summer Health Tips | మండుతున్న ఎండలు.. జాగ్రత్తలు పాటించకుంటే ప్రాణాపాయం: డాక్టర్​ ఆనంద్​ మాలు

లైఫ్​స్టైల్​తాజా వార్తలు

Summer Health Tips | మండుతున్న ఎండలు.. జాగ్రత్తలు పాటించకుంటే ప్రాణాపాయం: డాక్టర్​ ఆనంద్​ మాలు

చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా వేసవిలో వచ్చే ఆరోగ్య సమస్యలను నివారించవచ్చని డాక్టర్ ఆనంద్ మాలు చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచిస్తున్నారు.

Naresh chandan
Last updated: మార్చి 17, 2026 3:59 సా.
Naresh chandan
1 వారం ago
Share
Summer Health Tips | మండుతున్న ఎండలు.. జాగ్రత్తలు పాటించకుంటే ప్రాణాపాయం: డాక్టర్​ ఆనంద్​ మాలు
Summer Health Tips | మండుతున్న ఎండలు.. జాగ్రత్తలు పాటించకుంటే ప్రాణాపాయం: డాక్టర్​ ఆనంద్​ మాలు

అక్షరటుడే, ఇందూరు: Summer Health Tips | వేసవి కాలం ప్రారంభమవుతున్న వేళ ప్రజలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరాన్ని వైద్యులు ప్రస్తావిస్తున్నారు. రాత్రి వేళల్లో చల్లదనం ఉండగా, పగటి సమయంలో ఎండలు తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో శరీరంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశముందని హెచ్చరిస్తున్నారు.

Contents
  • Summer Health Tips | వేసవిలో వచ్చే ఆరోగ్య సమస్యలు..
    • Summer Health Tips | ఇలా చేస్తే బెటర్​..

Summer Health Tips | వేసవిలో వచ్చే ఆరోగ్య సమస్యలు..

వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నిజామాబాద్‌లోని మెడికవర్ హాస్పిటల్స్‌కు చెందిన జనరల్ ఫిజీషియన్ డాక్టర్ ఆనంద్ మాలు వివరిస్తున్నారు. వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా హీట్ స్ట్రోక్, డయేరియా (విరోచనాలు), జాండిస్ (పచ్చకామెర్లు) వంటి వ్యాధులు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

Summer Health Tips | ఇలా చేస్తే బెటర్​..

ఈ నేపథ్యంలో ప్రజలు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని వైద్యుడు సూచిస్తున్నారు. రోజుకు కనీసం 3 నుంచి 4 లీటర్ల వరకు నీరు తాగడం అవసరమని స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా మరిగించిన లేదా ఫిల్టర్ చేసిన శుభ్రమైన నీటినే వినియోగించాలని చెబుతున్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లొద్దంటున్నారు. బయటకు వెళ్లే సమయంలో తలపై తప్పకుండా క్యాప్ / టవల్‌ ధరించాలని, మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండలో తిరగడం నివారించాలని స్పష్టం చేస్తున్నారు.akshara summer

తేలికపాటి, పలుచని దుస్తులు ధరించడం మంచిదని డాక్టర్​ చెబుతున్నారు. మజ్జిగ, కొబ్బరి నీరు, నిమ్మరసం వంటి ద్రవాలను ఎక్కువగా తీసుకోవడం ద్వారా శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవచ్చని సూచిస్తున్నారు. బయట ఆహారానికి దూరంగా ఉండాలని, పరిశుభ్రత పాటిస్తూ చేతులను తరచూ శుభ్రంగా కడుక్కోవాలని సూచిస్తున్నారు.

పిల్లలు, వృద్ధులపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని స్పష్టం చేస్తున్నారు. ఎవరికైనా విరోచనాలు, వాంతులు, జ్వరం లేదా కళ్ళు, చర్మం పసుపు రంగులోకి మారడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని అంటున్నారు.

ఇది కూడా చదవండి: Sleep Fatigue Causes | కంటి నిండా నిద్రపోయినా అలసటగా అనిపిస్తోందా.. అయితే ఈ సమస్యలు ఉన్నట్టే!

GHMC Property Tax Dues | జీహెచ్‌ఎంసీ కఠిన చర్యలు.. బకాయిలపై ఉక్కుపాదం.. పలువురి ఆస్తుల స్వాధీనం
Probiotics for Women | మహిళల ఆరోగ్యానికి ‘ప్రొబయోటిక్స్’.. ఇవి చేసే మేలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
March 18 Horoscope | ఉద్యోగ యోగం.. ఈ రాశుల వారికి మెరుగుపడనున్న ఆర్థిక స్థితి!
EV Discount Employees | ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్​న్యూస్​.. ఎలక్ట్రిక్​ వాహనాలపై భారీగా డిస్కౌంట్​
Congress Senior Leaders | పోచారం ఎవరు..? ఆయనకు పదవి ఎందుకు..? సీఎం రేవంత్​పై జీవన్ రెడ్డి ఫైర్​!
TAGGED:dehydration caredoctor advice summerhealth tips indiaheat wave safetyheatstroke preventionindia summer healthseasonal diseasessummer health tips
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Adulterated Ginger Garlic Paste Adulterated Ginger Garlic Paste | భారీగా కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్​ స్వాధీనం​.. ఇద్దరి అరెస్ట్​
Next Article Chaitra Amavasya | కొత్త అమావాస్య.. పితృదేవతల ఆశీస్సుల కోసం ఉగాదికి ఒకరోజు ముందే చేసే పండగ! Chaitra Amavasya | కొత్త అమావాస్య.. పితృదేవతల ఆశీస్సుల కోసం ఉగాదికి ఒకరోజు ముందే చేసే పండగ!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?