అక్షరటుడే, వెబ్‌డెస్క్: sun damage skin | వేసవి కాలం వచ్చిందంటే చాలు భానుడి ప్రతాపానికి చర్మం కందిపోవడం, నల్లగా మారడం వంటి సమస్యలు సర్వసాధారణం. ఈ సమస్యల నుంచి ఉపశమనం కోసం చాలా మంది సన్‌స్క్రీన్ లోషన్లు వాడుతుంటారు.
అయితే, కేవలం పైన రాసే లోషన్లు మాత్రమే కాకుండా మనం తీసుకునే ఆహారం కూడా సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల (UV Rays) ప్రభావం నుంచి చర్మాన్ని రక్షిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చర్మ ఆరోగ్యాన్ని కాపాడే కొన్ని ప్రత్యేక పోషకాలు మన దైనందిన ఆహారంలో ఉండటం వల్ల ఎండ వల్ల కలిగే నష్టాన్ని తగ్గించుకోవచ్చు.
sun damage skin | చర్మ సంరక్షణలో పండ్ల పాత్ర:
వేసవిలో చర్మం కందిపోకుండా ఉండటంలో కొన్ని రకాల పండ్లు అద్భుతంగా పనిచేస్తాయి. ముఖ్యంగా దానిమ్మలో ఉండే ఎల్లాజిక్ ఆమ్లం సూర్యరశ్మి ప్రభావం నేరుగా చర్మంపై పడకుండా అడ్డుకుంటుంది.
ఇది చర్మంలో కొత్త కణాల ఉత్పత్తికి తోడ్పడి చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. అలాగే స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ వంటి పండ్లలో లభించే విటమిన్ సీ చర్మానికి రక్షణ కవచంలా పనిచేస్తుంది. జామ పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మ క్యాన్సర్ వంటి ముప్పుల నుంచి కాపాడటమే కాకుండా చర్మం మెరిసేలా చేస్తాయి. వీటితో పాటు పుచ్చకాయ, కివీ వంటి పండ్లు కూడా చర్మానికి ఎంతో మేలు చేస్తాయి.
sun damage skin | గ్రీన్ టీతో రక్షణ:
ఆరోగ్యం, ఫిట్‌నెస్ కోసం చాలామంది గ్రీన్ టీ తాగుతుంటారు. అయితే ఇది చర్మ సంరక్షణకు కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. గ్రీన్ టీలో ఉండే కొన్ని ప్రత్యేక సమ్మేళనాలు ఎండ వల్ల చర్మం కందిపోకుండా కాపాడటంలో సహాయపడతాయి. ఎండలో బయటకు వెళ్లేవారు క్రమం తప్పకుండా గ్రీన్ టీ తీసుకోవడం వల్ల చర్మం లోపలి నుంచి దృఢంగా మారుతుంది.
బంగాళాదుంపతో మెరుపు:
చాలా మందికి ఇష్టమైన బంగాళాదుంప కూడా సూర్యరశ్మి నుంచి చర్మాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే పిండి పదార్థాలు చర్మం కందిపోకుండా రక్షిస్తాయి. ఎండ తగిలిన ప్రదేశంలో బంగాళాదుంపను మెత్తగా చేసి రాస్తే చర్మం చల్లగామారటమే కాకుండా మెరుపును సంతరించుకుంటుంది. చర్మంపై ఏర్పడిన నలుపును తగ్గించడంలో కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది.
ఇది కూడా చదవండి: Sugar cravings causes | భోజనం తర్వాత తీపి తినాలనిపిస్తోందా.. అయితే శరీరంలో ఈ లోపం ఉన్నట్లే!
