అక్షరటుడే, వెబ్‌డెస్క్: Sunflower Seeds Beauty | కాలుష్యం, దుమ్ము, జిడ్డు కారణంగా ముఖంపై మొటిమలు రావడం, చర్మం కాంతిహీనంగా మారడం సహజం. అయితే, మన వంటింట్లో ఉండే పొద్దుతిరుగుడు గింజలతో ఈ సమస్యలకు చెక్ పెట్టవచ్చని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. చర్మ రకాన్ని బట్టి ఈ గింజలను ఎలా ఉపయోగించాలో, మెరిసే చర్మాన్ని ఎలా సొంతం చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
Sunflower Seeds Beauty | సహజమైన స్క్రబ్‌గా:
చర్మ రంధ్రాల్లో పేరుకుపోయిన మురికిని తొలగించడానికి పొద్దుతిరుగుడు గింజల స్క్రబ్ అద్భుతంగా పనిచేస్తుంది.
తయారీ: అరకప్పు గింజలను మిక్సీ పట్టి పొడి చేసుకోవాలి. ఈ పొడిని ఒక గాజు సీసాలో భద్రపరుచుకుని ఫ్రిజ్‌లో ఉంచాలి.
వాడే విధానం: ప్రతిరోజు కొద్దిగా పొడిని తీసుకుని, తగినంత నీరు కలిపి ముఖం, మెడపై మృదువుగా రుద్దాలి. దీనివల్ల చర్మం లోపలి నుంచి శుభ్రపడటమే కాకుండా, అవసరమైన పోషణ అంది ముఖం తాజా కళతో మెరుస్తుంది.
Sunflower Seeds Beauty | పొడి చర్మం సమస్యకు:
చర్మం పొడిబారిపోయి ఇబ్బంది పెడుతుంటే, ఈ గింజల ప్యాక్ మంచి తేమను అందిస్తుంది.
తయారీ: గింజలను రెండు, మూడు గంటల పాటు ఎండలో ఉంచి, ఆపై మిక్సీలో కాస్త గరుకుగా పొడి చేసుకోవాలి.
వాడే విధానం: ఒక స్పూన్ పొడికి, ఒక స్పూన్ మీగడ ఉన్న పాలు, చిటికెడు పసుపు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి 20 నిమిషాల తర్వాత కడిగేయాలి. వారానికి ఒకసారి ఇలా చేయడం వల్ల మురికి వదిలిపోవడమే కాకుండా, చర్మ ఛాయ మెరుగుపడి మృదువుగా తయారవుతుంది.
మిశ్రమ చర్మతత్వం:
ముకంపైన అక్కడక్కడా పొడి ప్యాచెస్ ఉన్నవారికి ఈ ఫేస్ ప్యాక్ చక్కగా సరిపోతుంది.
తయారీ: పైన చెప్పిన విధంగా సిద్ధం చేసుకున్న పొద్దుతిరుగుడు గింజల పొడిని ఒక స్పూన్ తీసుకోవాలి.
వాడే విధానం: దీనికి కొద్దిగా గంధం పొడి, రోజ్ వాటర్ కలిపి పేస్ట్‌లా చేయాలి. ఈ ప్యాక్‌ను ముఖానికి వేసుకుని 20 నిమిషాల తర్వాత తడి గుడ్డతో తుడిచేయాలి. ఇలా చేయడం వల్ల డ్రై ప్యాచెస్ తగ్గిపోయి, ముఖం అందంగా, ఆరోగ్యంగా కనిపిస్తుంది.
ఇది కూడా చదవండి: Good Luck Signs | అదృష్టం వరించే ముందు వచ్చే సంకేతాలివే.. ఇంట్లో ఇవి కనిపిస్తే ఇక తిరుగులేనట్టే!

