అక్షరటుడే, వెబ్డెస్క్: Supreme Judgement on Religion Change | మత మార్పిడులపై దేశ అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పు చెప్పింది. ఎస్సీ కులానికి చెందిన వాళ్లు ఒకవేళ మతం మారినట్లయితే వారి ఎస్సీ హోదా రద్దు అవుతుందని కోర్టు స్పష్టం చేసింది.
Supreme Judgement on Religion Change | ఇతర మతంలోకి మారితే రద్దు..
ఎస్సీ కులానికి చెందిన వాళ్లు హిందూ, బౌద్ధ, సిక్కు మతాల్లోకి కాకుండా ఇతర ఏ మతంలోకి మారిన కూడా.. వారి ఎస్సీ హోదా రద్దవుతుందని సుప్రీంకోర్టు (Supreme Court) తెలిపింది. గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ.. న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.
Supreme Judgement on Religion Change | ఏపీ హైకోర్టు విచారణలో..
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (AP High Court)లో గతంలో జరిగిన ఓ కేసు విచారణలో.. క్రైస్తవ మతంలోకి మారిన పాస్టర్ ఎస్సీ, ఎస్టీ చట్టం కింద రక్షణ పొందలేరని న్యాయస్థానం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. దీనిని సవాల్ చేస్తూ వారు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే దేశ అత్యున్నత న్యాయస్థానం.. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుకు మద్దతుగా నిలిచింది.
ఇది కూడా చదవండి..: bribery case | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వార్డు కార్యదర్శి

