అక్షరటుడే, ఎల్లారెడ్డి/ లింగంపేట: Surender Birthday Celebrations | ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే (Yellareddy Former MLA) నల్లమడుగు సురేందర్ జన్మదిన వేడుకలను ఎల్లారెడ్డి, లింగంపేటలలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు కార్యకర్తలు కేక్‌లు కట్ చేసి పలువురికి పంచిపెట్టారు.
Surender Birthday Celebrations | ఎల్లారెడ్డి పరిధిలోని..
ఎల్లారెడ్డి (Yellareddy) నియోజకవర్గంలోని ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్, తాడ్వాయి మండలాల్లో ఎల్లారెడ్డి మాజీ శాసనసభ్యులు జాజాల సురేందర్ జన్మదిన వేడుకలను నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఎల్లారెడ్డి పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అనంతరం పటాకులు కాల్చారు. అనంతరం ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో (Yellareddy Government Hospital) రోగులకు పండ్లు అందజేశారు. నాగిరెడ్డిపేట రాంప్రతాప్ టాకీస్‌లో ప్రతాపరెడ్డి, వంశీ గౌడ్ సాయిబాబా ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ జన్మదినాన్ని పురస్కరించుకొని పార్టీ కార్యకర్తలు ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు జలంధర్ రెడ్డి, ప్యాక్స్ అధ్యక్షుడు నర్సింలు, మాజీ కౌన్సిలర్ సాయిలు, ఇమాన్ సర్పంచ్ సాయిలు, నాయకులు శ్రవణ్ కుమార్, గంగారెడ్డి, రవి, పృథ్వీరాజ్, నాగం రాజయ్య , అంజా గౌడ్, శివానంద్, అర్వింద్ గౌడ్, బర్కత్, అలీపాషా, గోపాల్, యువనాయకులు బబ్లూ, పడమటి దయాకర్, భారత్, సాయి, అనిల్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Surender Birthday Celebrations | లింగంపేటలో..
లింగంపేట మండల (Lingampet Mandal) కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో బుధవారం ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్ జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కోసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ఆ పార్టీ మండల అధ్యక్షుడు దివిటి రమేష్ మాట్లాడుతూ.. ఎల్లారెడ్డి అభివృద్ధి సురేందర్‌తోనే సాధ్యమైందన్నారు. ఆయన చేసిన పనులు ఇప్పటికీ అద్దంలాగా కనబడుతున్నాయని పేర్కొన్నారు. ప్రజల క్షేమం కోసం ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు మాజీ ఎమ్మెల్యే అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ముదాం సాయిలు, కమ్మరి సిద్ధిరాములు, గాండ్ల నర్సింలు, యూసుఫ్, దాసరి పర్వయ్య, పరంధాములు, యాదిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: BLO Absence Issue | బీఎల్వోల గైర్హాజరుపై కలెక్టర్ ఆగ్రహం

