అక్షరటుడే, ఇందూరు: Surya Prabha Vahanam | నర్సింగ్పల్లిలోని ఇందూరు తిరుమల గోవింద వనమాల (Indore Tirumala Govinda Vanamala) బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడోరోజు మంగళవారం ఉదయం స్వామివారు సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.
వాహనం ముందు భక్తజన బృందాలు భజనలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనం.. ఆయురారోగ్యప్రాప్తి
సూర్యుడు సకలరోగ నివారకుడు, ఆరోగ్యకారకుడు, ప్రకృతికి చైతన్యప్రదాత అని దేవనాథ జీయర్ స్వామి అన్నారు. ఔషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నాడని పేర్కొన్నారు. ఈ ఉత్సవంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్యప్రభ, సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడేనని.. అందుకే సూర్యున్ని సూర్యనారాయణుడిగా కొలుస్తున్నామని ఆయన తెలియజేశారు. సూర్యప్రభ వాహనంలో స్వామివారిని దర్శిస్తే ఇతోధిక భోగభాగ్యాలు, సత్సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి అన్నారు.

Surya Prabha Vahanam | చంద్రప్రభ వాహనంపై శ్రీవారు..
కార్యక్రమంలో యజ్ఞాచార్యులు శ్రీనివాసాచార్యులు, లక్ష్మణ ఆచార్యులు, ఆలయ ప్రధాన అర్చకులు రోహిత్ కుమార్ ఆచార్యతో పాటు ఆలయ ధర్మకర్తలు దిల్ రాజు (Dil Raju) దంపతులు, నరసింహారెడ్డి దంపతులు శిరీష్ రెడ్డి దంపతులు విజయసింహారెడ్డి దంపతులు హరీష్ రెడ్డి దంపతులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు. నర్సింగ్‌పల్లి ఆలయాన్ని సందర్శించిన మాజీ ఎమ్మెల్యే బిగాల నర్సింగ్‌పల్లి (Narsingpally)లో బ్రహ్మోత్సవాల్లో మంగళవారం మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా పాల్గొన్నారు. వేంకటేశుడిని దర్శించుకుని భక్తితో పూజలు చేశారు. ఆయనతో పాటు బీఆర్ఎస్ నాయకులు హాజరయ్యారు.
ఇది కూడా చదవండి..: Mobile Phone Recovery | స్పెషల్ డ్రైవ్‌లో 123 ఫోన్ల రికవరీ: ఎస్పీ రాజేష్ చంద్ర

