Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Suryakumar Yadav Retirement | సూర్య‌కుమార్ రిటైర్ కాబోతున్నాడంటూ ప్ర‌చారాలు.. ఇన్‌డైరెక్ట్‌గా క్లారిటీ ఇచ్చిన టీ20 కెప్టెన్
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

క్రీడలు - Suryakumar Yadav Retirement | సూర్య‌కుమార్ రిటైర్ కాబోతున్నాడంటూ ప్ర‌చారాలు.. ఇన్‌డైరెక్ట్‌గా క్లారిటీ ఇచ్చిన టీ20 కెప్టెన్

క్రీడలు

Suryakumar Yadav Retirement | సూర్య‌కుమార్ రిటైర్ కాబోతున్నాడంటూ ప్ర‌చారాలు.. ఇన్‌డైరెక్ట్‌గా క్లారిటీ ఇచ్చిన టీ20 కెప్టెన్

టీ20 ప్రపంచకప్ 2026 తర్వాత రిటైర్మెంట్ తీసుకుంటాడనే వార్తలను టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కొట్టిపారేశాడు.

Srinivas kolluri
Last updated: మార్చి 10, 2026 10:37 ఉద.
Srinivas Kolluri
2 వారాలు ago
Share
Suryakumar Yadav Retirement
Suryakumar Yadav Retirement

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Suryakumar Yadav Retirement | టీమిండియా టీ20 కెప్టెన్ సూర్య కుమార్ యాద‌వ్ త‌న Suryakumar Yadav రిటైర్మెంట్‌పై వస్తున్న పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టాడు. ఐసీసీ మెన్స్ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 అనంతరం అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెబుతాడని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపించాయి.

Contents
  • Suryakumar Yadav Retirement | ఇంక స‌మ‌యం ఉంది..
    • Suryakumar Yadav Retirement | 2028 స‌మ్మ‌ర్ ఒలంపిక్స్ లాస్ ఏంజెల్స్ లో

మ్యాచ్‌లో గెలిచినా.. ఓడినా 35 ఏళ్ల సూర్య రిటైర్మెంట్ ప్రకటిస్తాడని ప్రచారం జరిగింది. అయితే ఆ వార్తలు నిజం కాదని సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) తన వ్యాఖ్యలతో స్పష్టం చేశాడు. టీ20 ప్రపంచకప్ ఫైన‌ల్ మ్యాచ్ ముగిసిన తర్వాత జరిగిన కార్యక్రమంలో జైషా చేతుల మీదుగా సూర్యకుమార్ యాదవ్ టైటిల్‌ను అందుకున్నాడు. మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన సూర్య తన భవిష్యత్ లక్ష్యాలను వెల్లడించాడు.

Suryakumar Yadav Retirement | ఇంక స‌మ‌యం ఉంది..

“మా తదుపరి టార్గెట్ ఒలింపిక్ స్వర్ణం. 2028 స‌మ్మ‌ర్ ఒలంపిక్స్‌ (Summer Olympics)లో క్రికెట్‌లో గోల్డ్ మెడల్ సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. అదే ఏడాది జరిగే ఐసీసీ మెన్స్ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2028 లో కూడా మంచి ప్రదర్శన ఇవ్వాలని భావిస్తున్నాం” అని సూర్యకుమార్ యాదవ్ తెలిపారు. ఈ వ్యాఖ్యలతో రిటైర్మెంట్ పుకార్లకు చెక్ పడింది. మరో రెండేళ్ల పాటు అయినా భారత జట్టు తరఫున ఆడే సంకేతాలు ఆయన ఇచ్చాడు. ఇక క్రికెట్ అభిమానులకు మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. సుమారు 128 ఏళ్ల విరామం తర్వాత ఒలింపిక్స్‌లోకి క్రికెట్ మళ్లీ అడుగుపెడుతోంది. 1900లో జరిగిన ఒలింపిక్స్ తర్వాత క్రికెట్‌కు మళ్లీ అవకాశం దక్కడం ఇదే మొదటిసారి.

Suryakumar Yadav Retirement
Suryakumar Yadav Retirement

Suryakumar Yadav Retirement | 2028 స‌మ్మ‌ర్ ఒలంపిక్స్ లాస్ ఏంజెల్స్ లో

2028 స‌మ్మ‌ర్ ఒలంపిక్స్ అమెరికాలోని లాస్ ఏంజెల్స్ (Los Angeles)లో జరగనుండగా, క్రికెట్ పోటీలు 2028 జూలై 12 నుంచి ప్రారంభమవుతాయి. ఒలింపిక్స్ అధికారిక ప్రారంభానికి రెండు రోజుల ముందే ఈ మ్యాచ్‌లు మొదలవుతాయి. క్రికెట్ పోటీలు జూలై 29న ముగియనున్నాయి. ఈ మ్యాచ్‌లన్నీ కూడా లాస్ ఎంజెలెస్‌కు సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న పొమోనో లోని ఫెయిర్ ప్లెక్స్ స్టేడియం (Fairplex Stadium)లో నిర్వహించనున్నారు. అక్కడ ప్రత్యేకంగా 500 ఎకరాల విస్తీర్ణంలో తాత్కాలిక స్టేడియాన్ని నిర్మిస్తున్నారు.ఒలింపిక్స్‌లో క్రికెట్ పోటీలు టీ20 ఫార్మాట్లో జరగనున్నాయి. పురుషులు, మహిళల విభాగాల్లో మొత్తం ఆరు జట్లు మాత్రమే పాల్గొంటాయి. ఈ ఆరు జట్లు స్వర్ణ, రజత, కాంస్య పతకాల కోసం పోటీ పడనున్నాయి.

ఇది కూడా చదవండి..: T20 World Cup 2026 | టీ20 వరల్డ్‌కప్‌లో చరిత్ర సృష్టించిన‌ భారత్.. న‌మోదైన రికార్డులు ఇవే..!

T20 World Cup Semifinals | టీ20 వరల్డ్ కప్ సెమీస్ సమరం.. సౌతాఫ్రికా-న్యూజిలాండ్ ఢీ, ఇంగ్లాండ్ ప్రత్యర్థి ఎవ‌రో?
BCCI Contract Changes | బీసీసీఐ కాంట్రాక్ట్ మార్పులతో బుమ్రాకు షాక్?.. రూ.2 కోట్ల నష్టం అంటూ సోషల్ మీడియాలో చర్చ
MS Dhoni Traffic Fine | రూల్స్ ఉల్లంఘించిన ఎంఎస్ ధోని.. ట్రాఫిక్ పోలీసులు ఎంత జ‌రిమానా విధించారంటే..!
Rinku Singh Father | టీమిండియా బ్యాటర్ రింకూ సింగ్‌ ఇంట్లో విషాదం.. తండ్రి ఖంచంద్ర సింగ్ కన్నుమూత
BCCI Reward India | టీమ్‌ ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా.. ఎన్ని కోట్లో తెలుసా!
TAGGED:Fairplex StadiumLos AngelesSummer OlympicsSuryakumar YadavSuryakumar Yadav Retirement
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Sri Lanka Fuel Prices Sri Lanka Fuel Prices | శ్రీలంకలో భారీగా పెరిగిన ఇంధన ధరలు
Next Article Pakistan Fuel Crisis Pakistan Fuel Crisis | ఉద్యోగుల జీతాల్లో కోత.. పాఠశాలలకు సెలవులు.. పాక్​ కీలక నిర్ణయాలు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?