Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: T20 World Cup 2026 | టీ20 ప్రపంచకప్ 2026పై యుద్ధ ప్రభావం.. జట్ల భద్రతపై ఐసీసీ అప్రమత్తం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

క్రీడలు - T20 World Cup 2026 | టీ20 ప్రపంచకప్ 2026పై యుద్ధ ప్రభావం.. జట్ల భద్రతపై ఐసీసీ అప్రమత్తం

క్రీడలు

T20 World Cup 2026 | టీ20 ప్రపంచకప్ 2026పై యుద్ధ ప్రభావం.. జట్ల భద్రతపై ఐసీసీ అప్రమత్తం

ఇరాన్​–ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తల ప్రభావం టీ 20 ప్రపంచ కప్​పై పడింది. దీంతో ఐసీసీ అప్రమత్తం అయింది.

Srinivas kolluri
Last updated: మార్చి 1, 2026 10:28 ఉద.
Srinivas Kolluri
4 వారాలు ago
Share
T20 World Cup 2026

అక్షరటుడే, వెబ్​డెస్క్ : T20 World Cup 2026 | ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సైనిక చర్యల నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు టీ20 ప్రపంచకప్ 2026పై ప్రభావం చూపుతున్నాయి. దుబాయ్ ఎయిర్‌పోర్ట్ మూసివేతతో ప్రయాణాల్లో అంతరాయం ఏర్పడగా, ఆటగాళ్ల భద్రతపై ఐసీసీ ప్రత్యేక చర్యలు చేపట్టింది.

Contents
  • T20 World Cup 2026 | దుబాయ్ ఎయిర్‌పోర్ట్ మూసివేతతో..
      • T20 World Cup 2026 | భద్రతకు ప్రాధాన్యం

భారత్ (Bharat), శ్రీలంక (Srilanka) వేదికలుగా ఉత్కంఠభరితంగా కొనసాగుతున్న ఐసీసీ మెన్స్ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 (ICC Men’s T20 World Cup 2026) కు మధ్యప్రాచ్య యుద్ధ సెగ తగిలింది. ఇరాన్​పై అమెరికా, ఇజ్రాయెల్‌ జరిపిన సైనిక చర్యలతో ఆ ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. టెహ్రాన్ నుంచి ప్రతీకార దాడుల హెచ్చరికల నేపథ్యంలో ఎర్ర సముద్రం, గల్ఫ్ దేశాల గగనతలంలో విమాన ప్రయాణాలకు ముప్పు ఏర్పడింది. ఈ పరిణామాలను International Cricket Council (ఐసీసీ) నిశితంగా గమనిస్తోంది. టోర్నీలో పాల్గొంటున్న జట్లు, మ్యాచ్ అధికారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అత్యవసర చర్యలు చేపట్టింది.

T20 World Cup 2026 | దుబాయ్ ఎయిర్‌పోర్ట్ మూసివేతతో..

ప్రపంచకప్‌లో పాల్గొన్న జట్లు, బ్రాడ్‌కాస్టర్లు, మ్యాచ్ అఫిషియల్స్ తమ దేశాలకు తిరుగు ప్రయాణంలో సాధారణంగా దుబాయ్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్ట్‌ని ప్రధాన ట్రాన్సిట్ హబ్‌గా ఉపయోగిస్తుంటారు. అయితే తాజా ఉద్రిక్త పరిస్థితుల కారణంగా దుబాయ్ విమానాశ్రయం కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం. దీంతో భారత్ (India) నుంచి యూరప్, ఆఫ్రికా దేశాలకు వెళ్లే విమాన సర్వీసులపై ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో భారత పౌర విమానయాన శాఖ ఎయిర్‌లైన్స్‌కు ప్రత్యేక సూచనలు జారీ చేసి, గగనతల మార్పులు , భద్రతా నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఆదేశించింది.

T20 World Cup 2026 | భద్రతకు ప్రాధాన్యం

ఈ పరిస్థితులపై స్పందించిన ఐసీసీ ప్రతినిధి, “టోర్నీతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరి భద్రతే మా మొదటి ప్రాధాన్యం. మా ట్రావెల్, లాజిస్టిక్స్, సెక్యూరిటీ బృందాలు అప్రమత్తంగా ఉన్నాయి. ఆటగాళ్లు సురక్షితంగా తమ ఇళ్లకు చేరుకునేందుకు యూరప్, దక్షిణాసియా, ఆగ్నేయాసియా మీదుగా ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలిస్తున్నాం” అని తెలిపారు. మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ వాతావరణం అంతర్జాతీయ క్రీడా ఈవెంట్లపై (Events) కూడా ప్రత్యక్ష ప్రభావం చూపుతున్నట్లు ఈ పరిణామాలు సూచిస్తున్నాయి. పరిస్థితులు ఎలా మారుతాయో అనేది రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది.

ఇది కూడా చదవండి : Ali Khamenei Death | ఖమేనీ మరణంపై ఇరాన్​ స్పందన.. అమెరికా, ఇజ్రాయెల్​ స్థావరాలపై భయంకరమైన దాడులు చేస్తామని హెచ్చరిక

IPL 2026 Schedule | ఐపీఎల్ 2026 షెడ్యూల్ విడుదల.. తొలి మ్యాచ్​లో తలపడే జట్లు ఇవే..
T20 World Cup 2026 Semifinal Rain | సెమీఫైనల్స్‌కి వర్షం ముప్పు ఉందా.. మ్యాచ్ రద్దైతే ఫైనల్‌కి ఎవరు?
T20 World Cup | సెమీస్ ఆశలు పదిలం.. జింబాబ్వేపై భారత జట్టు విజయభేరి
Iran Missile Attack | అమెరికా నౌక అబ్రహం లింకన్​పై ఇరాన్​ దాడి!
West Indies Team Travel | యుద్ధం వ‌ల‌న‌ భారత్‌లో చిక్కుకున్న వెస్టిండీస్ జట్టుకి గుడ్ న్యూస్.. తొమ్మిది రోజుల తర్వాత స్వదేశానికి ప్రయాణం
TAGGED:Cricket tournament newsDubai Airport closureGlobal sports impactICC security measuresIndia Sri Lanka venuesInternational cricket updatesMiddle East tensionsT20 World Cup 2026
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article T20 World Cup Semifinals T20 World Cup Semifinals | టీ20 వరల్డ్ కప్ సెమీస్ సమరం.. సౌతాఫ్రికా-న్యూజిలాండ్ ఢీ, ఇంగ్లాండ్ ప్రత్యర్థి ఎవ‌రో?
Next Article Vijay Rashmika Wedding Vijay Rashmika Wedding | విరోష్ పెళ్లి సందడి : దేశవ్యాప్తంగా స్వీట్లు, దేవాలయాల్లో అన్నదానం…
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?