Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: T20 World Cup 2026 | టీ20 వరల్డ్‌కప్‌లో చరిత్ర సృష్టించిన‌ భారత్.. న‌మోదైన రికార్డులు ఇవే..!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

క్రీడలు - T20 World Cup 2026 | టీ20 వరల్డ్‌కప్‌లో చరిత్ర సృష్టించిన‌ భారత్.. న‌మోదైన రికార్డులు ఇవే..!

క్రీడలు

T20 World Cup 2026 | టీ20 వరల్డ్‌కప్‌లో చరిత్ర సృష్టించిన‌ భారత్.. న‌మోదైన రికార్డులు ఇవే..!

T20 వరల్డ్ కప్ ఫైనల్స్ లో భారత్ వరుసగా రెండోసారి టైటిల్ సాధించింది. మొత్తం మూడో టీ20 వరల్డ్‌కప్‌ను కైవసం చేసుకుంది. ఈ క్ర‌మంలో అనేక రికార్డులు న‌మోద‌య్యాయి.

Srinivas kolluri
Last updated: మార్చి 9, 2026 10:14 ఉద.
Srinivas Kolluri
3 వారాలు ago
Share
T20 World Cup 2026
T20 World Cup 2026

అక్షరటుడే, కామారెడ్డి : T20 World Cup 2026 | అహ్మదాబాద్ (Ahmedabad) వేదికగా భారత క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై టీమిండియా అద్భుత విజయాన్ని నమోదు చేసింది.

Contents
  •  T20 World Cup 2026 | సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో
    • T20 World Cup 2026 | వరుసగా రెండోసారి టైటిల్
      • T20 World Cup 2026 | టీ20 ప్రపంచకప్ చరిత్రలో

 T20 World Cup 2026 | సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో

ఫైనల్ పోరులో కివీస్‌ను 96 పరుగుల భారీ తేడాతో ఓడించి భారత్ విశ్వవిజేతగా నిలిచింది. లక్ష్య ఛేదనలో 256 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన న్యూజిలాండ్ (New Zealand) జట్టు 19 ఓవర్లలోనే 159 పరుగులకు కుప్పకూలింది. ఈ విజయంతో భారత జట్టు మరోసారి ప్రపంచ క్రికెట్‌లో తన ఆధిపత్యాన్ని చాటుకుంది. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని భారత జట్టు ఈ టోర్నీలో అద్భుత ప్రదర్శనతో అభిమానులను అలరించింది. ఫైనల్ విజయం తర్వాత స్టేడియం మొత్తం సంబరాలతో మార్మోగిపోయింది.

T20 World Cup 2026 | వరుసగా రెండోసారి టైటిల్

ఈ విజయంతో టీమిండియా (Team India) వరుసగా రెండుసార్లు టీ20 వరల్డ్‌కప్ గెలిచిన తొలి జట్టుగా రికార్డు సృష్టించింది. 2024లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఛాంపియన్‌గా నిలిచిన భారత్, ఇప్పుడు 2026లో కూడా టైటిల్ సాధించి ఈ అరుదైన ఘనతను అందుకుంది. ఇప్పటివరకు ఏ జట్టు కూడా వరుసగా రెండు టీ20 ప్రపంచకప్ టైటిళ్లు గెలవలేదు. వెస్టిండీస్ (2012, 2016), ఇంగ్లాండ్ (2010, 2022) జట్లు చెరో రెండుసార్లు గెలిచినా వరుస విజయాలు సాధించలేకపోయాయి. భారత జట్టుకు ఇది మూడో టీ20 ప్రపంచకప్ టైటిల్. దీంతో ఈ ఫార్మాట్‌లో అత్యధిక టైటిళ్లు గెలిచిన జట్టుగా భారత్ నిలిచింది. 2007లో మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలో తొలి టీ20 వరల్డ్‌కప్‌ను భారత్ గెలుచుకుంది. ఆ తర్వాత చాలా సంవత్సరాలు సెమీఫైనల్ దశలోనే ఆగిపోయింది. అయితే 2024లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో మరోసారి కప్పు గెలిచిన టీమిండియా, ఇప్పుడు 2026లో మూడోసారి విజేతగా నిలిచింది.

T20 World Cup 2026 | టీ20 ప్రపంచకప్ చరిత్రలో

మొదటి టైటిల్ (2007) తర్వాత రెండో టైటిల్ (2024) కోసం భారత్‌కు 17 సంవత్సరాలు పట్టింది. అయితే మూడోసారి టైటిల్ గెలవడానికి మాత్రం అంత కాలం పట్టలేదు. రెండేళ్లలోపే మరోసారి టీ20 కప్పును కైవసం చేసుకుంది. దీంతో 2007, 2024, 2026 ఎడిషన్లలో విజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకు మరే జట్టు కూడా మూడు టీ20 వరల్డ్‌కప్ టైటిళ్లు గెలవలేదు. ఈ విజయంతో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) కూడా అరుదైన రికార్డు సృష్టించాడు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో సొంత గడ్డపై ట్రోఫీ గెలిచిన తొలి కెప్టెన్‌గా ఆయన నిలిచాడు. గతంలో ఏ కెప్టెన్ కూడా తమ దేశంలో జరిగిన టీ20 వరల్డ్‌కప్‌ను గెలవలేకపోయారు. ఇక గౌత‌మ్ గంభీర్ కూడా అరుదైన ఘ‌న‌త సాధించాడు. గంభీర్ నేతృత్వంలో రెండు ఐసీసీ టైటిల్స్ టీమిండియా సాధించింది. కాగా, భారత్ గతంలో 2007లో దక్షిణాఫ్రికాలో జరిగిన టోర్నీలో, అలాగే 2024లో బర్బాడోస్ వేదికగా జరిగిన టోర్నీలో విజేతగా నిలిచిన విష‌యం తెలిసిందే.

ఇది కూడా చదవండి..: India vs New Zealand Final | భారత్ vs న్యూజిలాండ్: T20 వరల్డ్ కప్ ఫైనల్‌లో టాస్ అత్యంత కీలకం..

IPL 2026 Schedule | ఐపీఎల్ 2026 షెడ్యూల్ విడుదల.. తొలి మ్యాచ్​లో తలపడే జట్లు ఇవే..
Sri Lanka Defeat | ఐసీసీ వ‌ర‌ల్డ్ క‌ప్‌లో లంకకి ఘోర‌ అవమానం… 19 ఏళ్ల టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఇదో చెత్త రికార్డు
Narendra Modi Stadium Water Price | దొరికిన కాడికి దోపిడి.. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో నీళ్ల బాటిల్‌ రూ.200.. టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌కు వచ్చిన అభిమానులకు చుక్కలు
India vs England Semi | సెమీస్‌లో భారత జట్టు భారీ స్కోర్… ఇంగ్లండ్‌కు 254 పరుగుల లక్ష్యం
Kuldeep Yadav Reception | అట్ట‌హాసంగా కుల్దీప్ యాదవ్ వెడ్డింగ్ రిసెప్షన్.. శాకాహార విందుతో అతిథులను మెప్పించిన టీమిండియా స్పిన్నర్
TAGGED:AhmedabadICC T20 World CupIndia Cricket RecordsIndia vs New Zealand FinalIndian Cricket Historynarendra modi stadium finalNew ZealandSuryakumar YadavSuryakumar Yadav CaptaincyT20 World Cup 2026Team India
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Iran Israel War UPDATES | మోజ్తాబా ఎన్నిక.. ఇరాన్​ యుద్ధంపై ట్రంప్​ కీలక వ్యాఖ్యలు Iran Israel War UPDATES | మోజ్తాబా ఎన్నిక.. ఇరాన్​ యుద్ధంపై ట్రంప్​ కీలక వ్యాఖ్యలు
Next Article Mojtaba Khamenei Mojtaba Khamenei | ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా మొజ్తాబా ఖమేనీ.. అమెరికా, ఇజ్రాయెల్ నుంచి హెచ్చరికలు
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?