Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: T20 World Cup Final | వరల్డ్ కప్ ఫైనల్‌లో న్యూజిలాండ్ తో ఫైట్.. పాత ట్రెండ్‌ని బ‌ట్టి ప్రపంచకప్ విజేతగా భారత్.. ?
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

క్రీడలు - T20 World Cup Final | వరల్డ్ కప్ ఫైనల్‌లో న్యూజిలాండ్ తో ఫైట్.. పాత ట్రెండ్‌ని బ‌ట్టి ప్రపంచకప్ విజేతగా భారత్.. ?

క్రీడలు

T20 World Cup Final | వరల్డ్ కప్ ఫైనల్‌లో న్యూజిలాండ్ తో ఫైట్.. పాత ట్రెండ్‌ని బ‌ట్టి ప్రపంచకప్ విజేతగా భారత్.. ?

టీ20 వరల్డ్ కప్ 2026 సెమీఫైనల్‌లో భారత జట్టు అద్భుత ప్రదర్శనతో ఇంగ్లాండ్‌పై 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముంబైలో జరిగిన ఈ ఉత్కంఠభరిత పోరులో భారత్ విజ‌యం సాధించి వరుసగా రెండోసారి ఫైనల్‌లోకి అడుగుపెట్టింది.

Srinivas kolluri
Last updated: మార్చి 7, 2026 12:10 సా.
Srinivas Kolluri
3 వారాలు ago
Share
T20 World Cup Final
T20 World Cup Final

అక్షరటుడే, వెబ్​డెస్క్ : T20 World Cup Final | టీ20 వరల్డ్ కప్ 2026 (T20 World Cup 2026) సెమీఫైనల్‌లో భారత జట్టు మరోసారి తన ప్రతిభను నిరూపించింది. ముంబై వేదికగా జరిగిన ఈ కీలక పోరులో ఇంగ్లాండ్ జట్టుపై 7 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. మ్యాచ్ అంతా ఉత్కంఠభరితంగా సాగి అభిమానులను కుర్చీలకు అతుక్కుపోయేలా చేసింది.

Contents
  • T20 World Cup Final | భార‌త్‌దే క‌ప్పు…
    •  T20 World Cup Final | భారత్ న్యూజిలాండ్ జట్టుతో తలపడనుం

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. భారత బ్యాటర్లు ఆరంభం నుంచే దూకుడుగా ఆడి భారీ స్కోర్ నమోదు చేశారు. ముఖ్యంగా సంజూ ఆడిన కీలక ఇన్నింగ్స్ జట్టుకు బలమైన పునాది వేసింది. ఇతర బ్యాటర్లు కూడా సహకరించడంతో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 253 పరుగుల భారీ స్కోర్ సాధించింది.

T20 World Cup Final | భార‌త్‌దే క‌ప్పు…

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు (England Team) కూడా గట్టిగానే పోరాడింది. వారి బ్యాటర్లు ధైర్యంగా ఆడుతూ చివరి వరకు మ్యాచ్‌ను ఉత్కంఠభరితంగా మార్చారు. ముఖ్యంగా బెథెల్ అద్భుత శతకం సాధించి జట్టుకు విజయం అందించేందుకు ప్రయత్నించాడు. అయినప్పటికీ భారత బౌలర్లు కీలక సమయాల్లో వికెట్లు తీసి ఇంగ్లాండ్‌ను 246 పరుగులకే పరిమితం చేశారు. దీంతో భారత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ వరుసగా రెండోసారి టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌కు చేరుకుంది. గత కొన్ని సంవత్సరాలుగా భారత్–ఇంగ్లాండ్ మధ్య సెమీఫైనల్ మ్యాచ్‌లు ఆసక్తికరమైన ట్రెండ్‌ను సృష్టిస్తున్నాయి. 2022 టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్ భారత్‌ను ఓడించి తరువాత ఫైనల్‌లో పాకిస్తాన్‌ (Pakistan)పై విజయం సాధించి ఛాంపియన్‌గా నిలిచింది.

 T20 World Cup Final | భారత్ న్యూజిలాండ్ జట్టుతో తలపడనుం

అలాగే 2024లో జరిగిన టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్‌లో భారత్ ఇంగ్లాండ్‌ను ఓడించింది. ఆ తర్వాత రోహిత్ శర్మ నాయకత్వంలో భారత జట్టు ట్రోఫీని గెలుచుకుంది. ఇప్పుడు 2026లో కూడా భారత్ సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించడం ఆసక్తికరంగా మారింది. దీంతో ఈసారి కూడా అదే ట్రెండ్ కొనసాగుతుందా అనే చర్చ క్రికెట్ అభిమానుల్లో మొదలైంది. ఈ టోర్నమెంట్ ఫైనల్‌లో భారత్ న్యూజిలాండ్ జట్టుతో తలపడనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ (Narendra Modi)స్టేడియం ఈ కీలక పోరుకు వేదిక కానుంది. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధిస్తే వరుసగా రెండు టీ20 వరల్డ్ కప్‌లను గెలిచిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించే అవకాశం ఉంది. దీంతో ఫైనల్ మ్యాచ్‌పై దేశవ్యాప్తంగా భారీ ఆసక్తి నెలకొంది.

ఇది కూడా చదవండి..: India Semi Final Win | సెమీస్‌లో భారత్ థ్రిల్లింగ్ విజయం.. 25 రికార్డులు నమోదు

Saketh Myneni Deputy Collector | టెన్నిస్ స్టార్‌కి డిప్యూటీ కలెక్టర్ పదవి.. క్రికెటర్ శ్రీచరణికి నజరానా
T20 World Cup 2026 | టీ20 ప్రపంచకప్ 2026పై యుద్ధ ప్రభావం.. జట్ల భద్రతపై ఐసీసీ అప్రమత్తం
Bandi Sanjay Allegations | ఎంఐఎం మెప్పు కోసమే అరెస్టులు, దాడులు: కేంద్రమంత్రి బండి సంజయ్
India Semifinal Chances | భారత్ సెమీస్ చేరాలంటే.. మనం గెలవడంతో పాటు సౌతాఫ్రికా ఓడిపోవద్దు..!
T20 World Cup Final | టాస్​ గెలిచి బౌలింగ్​ ఎంచుకున్న న్యూజిలాండ్​
TAGGED:England TeamNarendra ModiPakistanT20 World Cup 2026T20 World Cup Final
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Gaddar Cinema Awards Gaddar Cinema Awards | గద్దర్​ అవార్డుల ప్రకటన.. ఉత్తమ చిత్రంగా రాజు వెడ్స్​ రాంబాయి
Next Article Maoists Surrender Telangana Maoists Surrender Telangana | లొంగిపోనున్న మావోయిస్ట్​ అగ్రనేత గణపతి!
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?