అక్షరటుడే, వెబ్‌డెస్క్: T20 World Cup | సెమీస్ ఆశలు సజీవంగా ఉంచే మ్యాచ్‌ను భారత జట్టు Team India ఛేదించింది. జింబాబ్వే Zimbabwe ను చిత్తుగా ఓడించి, 72 పరుగుల భారీ స్కోర్‌తో గెలిచింది. సెమీస్ ఆశలను సజీవంగా నిలిపింది. టాస్ ఓడిన భారత జట్టు మొదట బ్యాటింగ్ చేపట్టింది. కాగా, జింబాబ్వే బౌలింగ్‌లో భారత ఆటగాళ్లు విధ్వంసం సృష్టించారు. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 256 పరుగులు చేశారు.
T20 World Cup | అదరగొట్టిన బ్రియాన్
257 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే జట్టు 6 వికెట్లు కోల్పోయి 184 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో బ్రియాన్ బెన్నెట్ (97) పరుగులు వృథా అయ్యాయి. అయినప్పటికీ టీ20 ప్రపంచ కప్ లో భారత జట్టుపై రెండో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన బ్యాటర్‌గా బ్రియాన్ బెన్నెట్ నిలిచాడు. (2010 ఎడిషన్‌లో భారత్‌పై వెస్టిండీస్ మాజీ క్రికెటర్ క్రిస్ గేల్ 98 పరుగులు చేశాడు.) భారత బౌలర్లలో అర్షదీప్ మూడు, అక్షర్ పటేల్, వరణ్ చక్రవర్తి చెరో వికెట్ తీసుకున్నారు.
T20 World Cup | ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్
మెరుపు ఇన్నింగ్స్‌తో హాఫ్ సెంచరీ చేసిన హార్దిక్ పాండ్య Hardik Pandya కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. అభిషేక్ శర్మ (55), హార్దిక్ పాండ్య (23 బంతుల్లో 50 రన్స్*), తిలక్ వర్మ (44*), ఇషాన్ కిషన్ (38), సూర్యకుమార్ యాదవ్ (33) మైదానంలో రాణించారు.
ఇది కూడా చదవండి: driving license grading points | డ్రైవింగ్ లైసెన్స్‌కు ఇక గ్రేడింగ్ పాయింట్లు.. తప్పుల పుట్ట పెరిగితే లైసెన్స్ రద్దు

