Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Tadbund Hanuman Temple | భజనలు, కీర్తనలు.. జెన్​జీ కి శనివారం నైట్​ హబ్​గా తాడ్​బండ్​ హనుమాన్​ సన్నిధి!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

భక్తి - Tadbund Hanuman Temple | భజనలు, కీర్తనలు.. జెన్​జీ కి శనివారం నైట్​ హబ్​గా తాడ్​బండ్​ హనుమాన్​ సన్నిధి!

భక్తితాజా వార్తలుతెలంగాణహైదరాబాద్

Tadbund Hanuman Temple | భజనలు, కీర్తనలు.. జెన్​జీ కి శనివారం నైట్​ హబ్​గా తాడ్​బండ్​ హనుమాన్​ సన్నిధి!

భక్తి, సంగీతం, యువత ఉత్సాహం కలగలిసిన తాడ్‌బండ్ హనుమాన్ ఆలయం ప్రస్తుతం గ్రేటర్​ హైదరాబాద్‌ నగరంలో శనివారం రాత్రి ప్రత్యేక ఆకర్షణగా మారింది. “నైట్ అవుట్”కు వెళ్లే యువతలో చాలా మంది ఇప్పుడు “భజన్ నైట్” కోసం ఈ ఆలయాన్ని ఎంచుకుంటున్నారు.

Naresh chandan
Last updated: మార్చి 19, 2026 12:59 సా.
Naresh chandan
1 వారం ago
Share
Tadbund Hanuman Temple | భజనలు, కీర్తనలు.. జెన్​జీ కి శనివారం నైట్​ హబ్​గా తాడ్​బండ్​ హనుమాన్​ సన్నిధి!
Tadbund Hanuman Temple | భజనలు, కీర్తనలు.. జెన్​జీ కి శనివారం నైట్​ హబ్​గా తాడ్​బండ్​ హనుమాన్​ సన్నిధి!

అక్షరటుడే, హైదరాబాద్: Tadbund Hanuman Temple | గ్రేటర్​ హైదరాబాద్​లోని తాడ్‌బండ్‌లో ఉన్న హనుమాన్ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక క్షేత్రం. నిత్యం వందల మంది స్వామి వారిని దర్శించుకుంటారు. కాగా, ఇటీవల ఈ ఆలయం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ముఖ్యంగా ప్రతి శనివారం రాత్రి ఇక్కడ జరిగే భజన కార్యక్రమాలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ముఖ్యంగా శనివారం జెన్-జీ యువతకు కొత్త “నైట్ స్పాట్”గా మారింది.akshara tad

Tadbund Hanuman Temple | పారాయణం

ఆలయం శనివారం రాత్రి ప్రత్యేకంగా అర్ధరాత్రి వరకు తెరిచి ఉంచడంతో వందలాది మంది యువతీయువకులు ఇక్కడికి చేరుకుంటున్నారు. భజనలు, కీర్తనలు, హనుమాన్ చాలీసా పారాయణంతో తరిస్తున్నారు. భక్తి భావంతో ఆంజనేయస్వామిని కొలుస్తున్నారు. ఆధ్యాత్మిక వాతావరణంలో యువత గుంపులుగా కూర్చొని భజన చేయడం ప్రత్యేక ఆకర్షణగా మారింది.

తాడ్‌బండ్ హనుమాన్ ఆలయంలో శనివారం రాత్రి భజన సంప్రదాయం దశాబ్దాలుగా కొనసాగుతోంది. రాత్రి 9 గంటల తర్వాత ప్రారంభమయ్యే భజనలు అర్ధరాత్రి వరకు కొనసాగుతూనే ఉంటాయి. అనంతరం ప్రత్యేక హారతి ఇస్తారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో సాధారణంగా వందలాది మంది భక్తులు భాగస్వామ్యమవుతారు.

Tadbund Hanuman Temple | స్పిరిచువల్ నైట్ కల్చర్

ఇటీవల సామాజిక మాధ్యమాల్లో ఈ భజన వేడుకలు వైరల్ కావడంతో యువతలో ఆసక్తి మరింత పెరిగింది. ఫలితంగా ప్రతి శనివారం రాత్రి ఆలయం వద్ద భారీగా యువత చేరుకుంటోంది. కొందరు దీనిని “స్పిరిచువల్ నైట్ కల్చర్”గా వర్ణిస్తున్నారు.

సంగీతం, భక్తి, సామూహిక ప్రార్థనలతో నిండిన ఈ భజన కార్యక్రమాలు యువతను ఆధ్యాత్మికత వైపు మళ్లిస్తున్నాయని ఆలయ పురోహితులు చెబుతున్నారు. రాత్రి ఆలయంలో వినిపించే భజనలు, మంత్రోచ్ఛారణలతో ఈ ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

ఇది కూడా చదవండి: Good Luck Signs | అదృష్టం వరించే ముందు వచ్చే సంకేతాలివే.. ఇంట్లో ఇవి కనిపిస్తే ఇక తిరుగులేనట్టే!
Stock Market Gains | భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు
Telangana Summer Heat | మండుతున్న ఎండలు.. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి
Regional Ring Road Telangana | తెలంగాణ రీజినల్ రింగ్ రోడ్ దక్షిణ భాగానికి ముందడుగు
Ugadi Festival Significance | తెలుగు వారి కొత్త ఏడాది ‘ఉగాది’.. ఈ పండుగ వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!
Gold Silver Prices | అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతల ప్రభావం.. ఆకాశాన్నంటుతున్న బంగారం, వెండి ధరలు
TAGGED:gen z trendshanuman temple hyderabadhyderabad temple newsindia temple newssaturday night bhajansspiritual gatheringstadbund hanuman templeyouth spirituality
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Chahal Fitness IPL 2026 Chahal Fitness IPL 2026 | ఐపీఎల్ 2026 కోసం కొత్త నిర్ణయం తీసుకున్న చాహల్… ఆరు నెలలుగా మద్యానికి దూరం
Next Article IRCTC Summer Tours IRCTC Summer Tours | సమ్మర్ టూర్‌కు ఐఆర్‌‌సీటీసీ రెడీ.. హైదరాబాద్ నుంచి నాలుగు ప్రత్యేక రైళ్లు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?