అక్షరటుడే, హైదరాబాద్: Tank Bund Shiva | Tank Bund వద్ద గత రెండు దశాబ్దాలు (20 years) గా అనేక మంది ప్రాణాలను కాపాడుతూ ‘ట్యాంక్ బండ్ శివ’గా పేరుగాంచిన శివ అనే వ్యక్తి సేవలను తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. అతడికి అధికారిక గుర్తింపు ఇచ్చింది.
హైదరాబాద్‌లోని Hussain Sagar ట్యాంక్‌బండ్‌లో ఆత్మహత్యకు ప్రయత్నించే వారిని గత 20 ఏళ్లుగా శివ అడ్డుకుంటూ వచ్చారు. ఇప్పటివరకు 200 మందికి పైగా ప్రాణాలను రక్షించారు. దీనికితోడు నీటిలో మునిగిపోయిన వందలాది మృతదేహాలను సైతంబయటకు తీసి, వారి కుటుంబాలకు అప్పగించడంలో కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు.
Tank Bund Shiva | సీఎం దృష్టికి..
ఇంతటి సేవ చేస్తున్నప్పటికీ, ఎన్నో సంవత్సరాలు శివ కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతోంది. రోజువారీ జీవనోపాధి కోసం పోరాడుతోంది. కుటుంబాన్ని పోషించడం శివకు కష్టసాధ్యంగా మారింది. ఈ విషయం ఇటీవలే సీఎం Revanth Reddy దృష్టికి వెళ్లింది.
దీంతో ముఖ్యమంత్రి వెంటనే స్పందించారు. శివ కుటుంబానికి పలు రకాల సహాయాలను ప్రకటించారు. శివకు రూ. 5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. శివ కుమారుడికి హోం గార్డ్ ఉద్యోగం ఇచ్చారు. కుటుంబానికి 2BHK ఇల్లు కూడా కేటాయించారు.
Tank Bund Shiva | స్విమ్మింగ్ పూల్..
ఈ సహాయాలకు తోడు.. శివ తనకు ఉన్న ఈత నైపుణ్యాలను ఉపయోగించి జీవనోపాధి పొందేందుకు Tank Bund సమీపంలో ఒక స్విమ్మింగ్ పూల్ నిర్మించాలని విన్నవించారు. ఈ విన్నపానికి స్పందించిన ముఖ్యమంత్రి.. ప్రాజెక్ట్ పనులను ప్రారంభించాలని సంబంధిత అధికారులకు ఆదేశించినట్లు సమాచారం.
