అక్షరటుడే, వెబ్డెస్క్ : Tata EV Discount | ప్రభుత్వ ఉద్యోగులకు టాటా గుడ్న్యూస్ చెప్పింది. ఈవీ కార్లపై 10 శాతం నుంచి 20 శాతం వరకు రాయితీ ఇవ్వడానికి ముందుకు వచ్చింది.
రాష్ట్రంలో ఈవీ వాహనాలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ మేరకు ప్రభుత్వ ఉద్యోగులకు రాయితీపై ఈవీ వాహనాలు ఇచ్చేలా ప్రభుత్వం ఆయా కంపెనీలతో చర్చలు జరిపింది. రాయితీ ఇవ్వడానికి ఇప్పటికే పలు కంపెనీలు ముందుకు రాగా.. తాజాగా టాటా సైతం ఓకే చెప్పింది. ఈవీ వాహనాలను ప్రోత్సహించడంలో భాగంగా మినిస్టర్ క్వార్టర్స్ నుంచి అసెంబ్లీకి ఎమ్మెల్యే దానం నాగేందర్ (MLA Danam Nagender)తో మంత్రి పొన్నం (Minister Ponnam) సోమవారం ఈవీ కారులో ప్రయాణించారు.
Tata EV Discount | కాలుష్యం తగ్గించడానికి..
ప్రభుత్వ ఉద్యోగులకు ఈవీ వాహనాలకు 10-20 శాతం ప్రోత్సాహానికి ముందుకు వచ్చిన టాటా మోటార్స్ (Tata Motors)ను మంత్రి అభినందించారు. కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడడానికి ప్రభుత్వం ఈవీ పాలసీ తీసుకొచ్చిందన్నారు. ఈవీ పాలసీలో భాగంగా ప్రభుత్వం 100 శాతం రోడ్ టాక్స్, రిజిస్ట్రేషన్ టాక్స్ మినహాయింపు ఇచ్చిందని వెల్లడించారు. ఇప్పటికే మహీంద్ర ఎలక్ట్రిక్, గ్రావిటన్ మోటార్స్, ఓలా ఎలక్ట్రిక్స్, ఏతర్ ఎనర్జీ కంపెనీలు రాయితీ ఇవ్వడానికి ముందుకు వచ్చాయి..
Tata EV Discount | పూడికతీత కోసం.
చెరువుల పూడికతీత, కలుపు మొక్కల తొలగింపు కోసం తీసుకొచ్చిన అధునాతన ఎక్స్ కావేటర్ను మంత్రి పొన్నం ప్రారంభించారు. ఇది చెరువు అడుగుభాగంలో పూడికతీత, డ్రెడ్జింగ్ పనులు, కట్టలను బలోపేతం చేయడం, శిథిలాలు, బురద తొలగింపు పనులు చేయడానికి ఉపయోగ పడుతుందన్నారు. గణేశ విగ్రహ నిమజ్జనం, దుర్గా విగ్రహ నిమజ్జనం, బతుకమ్మ, ఛత్ పూజ, ఇతర పండుగల సమయంలో దీనిని వినియోగించవచ్చవన్నారు.
ఇది కూడా చదవండి..: Stock Market Crash | తీవ్ర ఒడిదుడుకుల్లో మార్కెట్లు.. భారీ నష్టాల్లో సూచీలు
