Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Teachers Caught by ACB | ఏసీబీకి చిక్కిన ఎంఈవో, ఉపాధ్యాయుడు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Teachers Caught by ACB | ఏసీబీకి చిక్కిన ఎంఈవో, ఉపాధ్యాయుడు

తెలంగాణ

Teachers Caught by ACB | ఏసీబీకి చిక్కిన ఎంఈవో, ఉపాధ్యాయుడు

పాఠశాల హెచ్​ఎం, స్కూల్ అసిస్టెంట్​ లంచం తీసుకుంటూ దొరికారు. ఈ ఘటన మహబూబాబాద్​ జిల్లాలో చోటు చేసుకుంది.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 8, 2026 3:34 సా.
Srinivas Kolluri
11 గంటలు ago
Share
Teachers Caught by ACB

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Teachers Caught by ACB | విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టాల్సిన గురువులే అడ్డదారి తొక్కారు. ఆదర్శంగా ఉండాల్సిన ఉపాధ్యాయులు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ఈ ఘటన మహబూబాబాద్ (Mahabubabad)​ జిల్లాలో చోటు చేసుకుంది.

Contents
  • Teachers Caught by ACB | పాఠశాలలో లంచం..
    • Teachers Caught by ACB | లంచం ఇవ్వొద్దు

గూడురు మండలం అయోధ్యపురం ఉన్నత పాఠశాల హెచ్​ఎం రవికుమార్​ ఎంఈవో (MEO)గా కొనసాగుతున్నారు. అలాగే స్కూల్​ అసిస్టెంట్ (SA)​ జి చంద్రమౌలి ఇన్​చార్జి క్లర్క్​గా వ్యవహరిస్తున్నారు. వీరిద్దరిని ఏసీబీ అధికారులు బుధవారం రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. ఓ విశ్రాంత ఉపాధ్యాయుడికి సంబంధించిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) పదవీ విరమణ ప్రయోజన బిల్లులను తయారు చేసి, వాటిని ఏజీఏ కార్యాలయానికి పంపినందుకు వీళ్లు లంచం డిమాండ్​ చేశారు.

Teachers Caught by ACB | పాఠశాలలో లంచం..

హెచ్​ఎం లంచం అడగడంతో బాధితుడు ఏసీబీ అధికారులకు సమాచారం అందించాడు. ఈ మేరకు ఫిర్యాదుదారుడి నుంచి గూడూరు జెడ్పీహెచ్​ఎస్ (ZPHS)​ ప్రాంగణంలో రూ.15 వేల లంచం తీసుకుంటుండగా వరంగల్ యూనిట్ ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థులకు ఆదర్శంగా ఉండాల్సిన ఉపాధ్యాయులు.. పాఠశాలలోనే లంచం తీసుకుంటూ దొరకడం గమనార్హం.

Teachers Caught by ACB | లంచం ఇవ్వొద్దు

ప్రభుత్వ అధికారులు లంచం డిమాండ్ చేస్తే ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు కోరుతున్నారు. వారిపై చట్ట ప్రకారం చర్య తీసుకోవడం కోసం ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కు ఫోన్​ చేయాలని కోరారు. ఏసీబీ తెలంగాణను వాట్సాప్ (9440446106), వెబ్​సైట్ (ACB Website)​ ద్వారా కూడా ఫిర్యాదు చేయొచ్చని వివరించారు. ఫిర్యాదుదారుడి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.

ఇది కూడా చదవండి : Hyderabad Road Accident | బైక్​ను ఢీకొన్న కారు.. ఇద్దరు బీటెక్ విద్యార్థుల మృతి

Mother Attack Children | పిల్లలపై కత్తితో దాడి చేసి.. తల్లి ఆత్మహత్యాయత్నం
Kazipet Railway Division | కాజీపేట రైల్వే డివిజన్​ ఏర్పాటు చేయాలి : కేటీఆర్​
Musi Project Allegations | మూసీ ప్రాజెక్ట్​ పేరిట భూములు పంచుకునే యత్నం : కవిత
Illegal Brick Kilns | నిబంధనలకు పాతర.. జోరుగా అక్రమ ఇటుక బట్టీలు..
Gas Cylinder Booking | గ్యాస్​ సిలిండర్​ బుకింగ్​ గడువు 45 రోజులకు పెంపు
TAGGED:ACB bribery caseMahabubabad newsMEO corruptionpension bribery caseteachers caught ACBTelangana school scam
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Congress Office Dispute Congress Office Dispute | కాంగ్రెస్​ పార్టీ జిల్లా కార్యాలయంలో గొడవ.. ‘కేక్’​ కోసం వాగ్వాదం
Next Article Dharpalli Area Hospital | Dharpalli Area Hospital | ధర్పల్లి ఏరియా ఆస్పత్రి పనులు త్వరితగతిన పూర్తవ్వాలి: కలెక్టర్​ ఇలా త్రిపాఠి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?