Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Teachers Pay Delay | ఏడాదైనా పారితోషికం ఇవ్వరా..? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఉపాధ్యాయ సంఘాల జేఏసీ
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Teachers Pay Delay | ఏడాదైనా పారితోషికం ఇవ్వరా..? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఉపాధ్యాయ సంఘాల జేఏసీ

నిజామాబాద్

Teachers Pay Delay | ఏడాదైనా పారితోషికం ఇవ్వరా..? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఉపాధ్యాయ సంఘాల జేఏసీ

పదోతరగతి మూల్యాంకనం చేసి ఏడాది పూర్తయిందని, కులగణన చేపట్టి ఏడాదిన్నర కావస్తున్నా పారితోషికం ఇంకా ఇవ్వకపోవడం సరికాదని ఉపాధ్యాయ సంఘాల జేఏసీ ఆవేదన వ్యక్తం చేసింది. జిల్లా కేంద్రంలోని పదోతరగతి స్పాట్ కేంద్రం వద్ద వారు మంగళవారం నిరసన చేపట్టారు.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 7, 2026 6:43 సా.
Shashi kiran Mottala
1 రోజు ago
Share
Teachers Pay Delay |
Teachers Pay Delay | ఏడాదైనా పారితోషికం ఇవ్వరా..? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఉపాధ్యాయ సంఘాల జేఏసీ

అక్షరటుడే, కామారెడ్డి: Teachers Pay Delay | పదోతరగతి మూల్యాంకనం చేసి ఏడాది పూర్తయిందని, కులగణన (caste census payments) చేపట్టి ఏడాదిన్నర కావస్తున్నా పారితోషికం ఇంకా ఇవ్వకపోవడం (government dues) సరికాదని ఉపాధ్యాయ సంఘాల జేఏసీ ఆవేదన వ్యక్తం చేసింది. జిల్లా కేంద్రంలోని (Kamamreddy) పదోతరగతి స్పాట్ కేంద్రం వద్ద (SSC spot valuation) ఉపాధ్యాయ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో భోజన విరామం సమయంలో నిరసన (teachers protest) తెలిపారు.

Contents
  • Teachers Pay Delay | 2025లో మార్చిలో నిర్వహించిన పదో తరగతి..
    • Teachers Pay Delay | జనగణన చేసి 18 నెలలు గడుస్తున్నా..

Teachers Pay Delay | 2025లో మార్చిలో నిర్వహించిన పదో తరగతి..

ఈ సందర్భంగా టీటీజేఏసీ (TTJAC) జిల్లా ఛైర్మన్ అల్లాపూర్ కుశాల్, యూఏస్పీసీ జిల్లా ఛైర్మన్ ఆకుల బాబు, జాక్టో జిల్లా ఛైర్మన్ సయ్యద్ ఖలీముద్దీన్ మాట్లాడుతూ.. 2025 మార్చిలో నిర్వహించిన పదోతరగతి స్పాట్ మూల్యాంకనం విధుల పారితోషికం సుమారు రూ.20 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో 50వేల మంది సిబ్బందితో కులగణన నిర్వహించి 18 నెలలు గడుస్తున్నా ప్రభుత్వం పారితోషికం చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కులగనణ సర్వేలో ఎన్యుమరేటర్​కు రూ.10వేలు, సూపర్​వైజర్​కు రూ.12వేల చొప్పున మొత్తం సుమారు రూ.50 కోట్ల వరకు చెల్లించాల్సి ఉందని చెప్పారు.

Teachers Pay Delay | జనగణన చేసి 18 నెలలు గడుస్తున్నా..

జనగణన పూర్తి చేసి 18 నెలలు గడుస్తున్నా పారితోషికాన్ని చెల్లించకపోవడం బాధాకరమని, ఇది ఉద్యోగులపై ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యాన్ని తెలియజేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. పదోతరగతి మూల్యాంకన విధులకు చెల్లించే పారితోషికం గతేడాది పెంచలేదని, ఇంటర్ స్పాట్​ రేట్లు రెండుసార్లు పెంచారని గుర్తుచేశారు. పదోతరగతి స్పాట్ రేట్లు కనీసం 50శాతం పెంచాలని, ఈ ఏడాది మూల్యాంకనం పూర్తి కాగానే స్పాట్ విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకు పారితోషికం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఇప్పటికే చెల్లించగా మిగిలిన అన్ని జిల్లాల్లో 2025 మార్చి ఎస్సెస్సీ స్పాట్ మూల్యాంకన పారితోషికాన్ని, కులగణన పారితోషికాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు చింతల లింగం, టీఆర్టీఎఫ్​ జిల్లా అధ్యక్షుడు బషీర్, ఎస్టీయూటీఎస్ జిల్లా నాయకులు పంపరి ప్రవీణ్ కుమార్, డీటీఎఫ్ ప్రభాకర్, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు యాదయ్య, ఇతర సంఘాల బాధ్యులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి : Trump Final Warning | ఈ రాత్రికి ఇరాన్​ నాగరికత అంతం అవుతుంది.. ట్రంప్​ ఫైనల్ వార్నింగ్​

Dalit Boycott Complaint | డప్పు కొట్టకపోతే బహిష్కరిస్తారట..పోలీసులకు దళితుల ఫిర్యాదు
Dharmapuri Sanjay | ధర్మపురి సంజయ్ అభిమానుల దీక్ష విరమణ
Kamareddy 38th Ward | దొంగ ఓట్లతోనే గెలిచారు..: 38వ వార్డు అభ్యర్థి రంగ మాధవి
Crop Compensation Demand | కలెక్టరేట్​ను ముట్టడించిన రైతులు.. పంట నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్​..
BLO Absence Issue | బీఎల్​వోల గైర్హాజరుపై కలెక్టర్​ ఆగ్రహం
TAGGED:caste census paymentsgovernment duespay delay IndiaSSC valuation spotteachers protestTelangana teachersTTJAC
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Trump Final Warning Trump Final Warning | ఈ రాత్రికి ఇరాన్​ నాగరికత అంతం అవుతుంది.. ట్రంప్​ ఫైనల్ వార్నింగ్​
Next Article Contaminated Water Packets Contaminated Water Packets | ప్యాకెట్​లలో వాటర్​ తాగుతున్నారా.. ఈ విషయం తెలిస్తే షాక్​
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?