అక్షరటుడే, వెబ్‌డెస్క్: Tehran Oil Depot Fire | ఇరాన్ రాజధాని Tehranలో దారుణం చోటుచేసుకుంది. పట్టణ పరిసర ప్రాంతంలో ఉన్న Shehran Oil Depotలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకోవడం అంతర్జాతీయంగా చర్చకు దారి తీసింది. శనివారం అర్ధరాత్రి సమయంలో జరిగిన ఈ ఘటనకు Israel దాడి కారణమని సమాచారం.
Tehran Oil Depot Fire | భారీ మంటలు…
ఉత్తర Tehran నగర శివార్లలో ఉన్న షెహ్రాన్ ఆయిల్ డిపో వద్ద భారీ పేలుళ్ల అనంతరం మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. ఆయిల్ నిల్వ ట్యాంకులు కావడంతో వేగంగా మంటలు వ్యాపించాయి. ఘటన స్థలంలో నుంచి తీసిన చిత్రాల్లో అగ్నిజ్వాలలు ఆకాశాన్ని తాకుతున్నట్లు కనిపించాయి.
స్థానిక మీడియా కథనం ప్రకారం.. అగ్నిప్రమాదం వల్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో పొగ కమ్ముకుంది. అగ్నిమాపక సిబ్బంది, అత్యవసర బృందాలు వెంటనే చేరుకుని మంటలను అదుపు చేయడానికి తీవ్రంగా శ్రమించాయి.
దాడి బాధ్యత స్వీకరించిన ఇజ్రాయెల్
ఈ ఘటనపై Israel Defense Forces స్పందించింది. ఇరాన్ సైనిక వ్యవస్థకు చెందిన ఇంధన నిల్వ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేపట్టినట్లు వెల్లడించింది. తమ భద్రతకు ముప్పుగా భావించి, ప్రత్యర్థి మౌలిక సదుపాయాలే లక్ష్యంగా దాడులు జరిపినట్లు తెలిపింది.
ఉద్రిక్తతలకు మరింత ఊతం
ఇప్పటికే Iran – Israel మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. తాజా దాడి పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చే ప్రమాదం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇంధన నిల్వ కేంద్రాలే లక్ష్యంగా జరిగిన దాడి ప్రాంతీయ భద్రతకు మరింత ముప్పుగా మారింది. తాజా ఘటనపై అంతర్జాతీయ సమాజం ఆందోళన చెందుతోంది. అగ్నిప్రమాదంతో జరిగిన నష్టం, మృతులు, గాయపడిన వారి వివరాలు ఇంకా అధికారికంగా వెలువడలేదు.

