Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Telangana Assembly Elections | 2029లో అసెంబ్లీ ఎన్నికలు : సీఎం రేవంత్​రెడ్డి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Telangana Assembly Elections | 2029లో అసెంబ్లీ ఎన్నికలు : సీఎం రేవంత్​రెడ్డి

తెలంగాణతాజా వార్తలు

Telangana Assembly Elections | 2029లో అసెంబ్లీ ఎన్నికలు : సీఎం రేవంత్​రెడ్డి

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు 2029లో వస్తాయని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందన్నారు.

Srinivas kolluri
Last updated: మార్చి 18, 2026 3:00 సా.
Srinivas Kolluri
1 వారం ago
Share
Telangana Assembly Elections

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Telangana Assembly Elections | తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) 2029లో వస్తాయని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడారు.

Contents
  • Telangana Assembly Elections | సాధ్యమేనా..
    • Telangana Assembly Elections | గతంలో పార్లమెంట్​తో పాటే..

రాష్ట్రంలో 2023 నవంబర్​లో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ లెక్కన 2028 నవంబర్​, డిసెంబర్​లో ఎన్నికలు జరగాలి. సీఎం (CM Revanth Reddy) మాట్లాడుతూ.. షెడ్యూల్ ప్రకారం తెలంగాణ ఎన్నికలు 2028 డిసెంబర్​లో ఉండాలని, కానీ మరో నాలుగు, ఐదు నెలలు ఆలస్యంగా డిసెంబర్​లో వస్తాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం (Central Government) జమిలీ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధం అవుతోందని ఆయన పేర్కొన్నారు. దీంతో 2029లో దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సైతం పార్లమెంట్ ఎన్నికలతో పాటు 2029లో జరిగే అవకాశం ఉందన్నారు.

Telangana Assembly Elections | సాధ్యమేనా..

ఒకే దేశం – ఒకే ఎన్నికలు అనే విధానాన్ని తీసుకు రావాలని కేంద్రంలోని బీజేపీ (BJP) యోచిస్తోంది. దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలు నిర్వహించాలని చూస్తోంది. అయితే పలు ప్రాంతీయ పార్టీలు దీనిని వ్యతిరేకిస్తున్నాయి. ప్రస్తుతం ఒక్కో రాష్ట్రానికి ఒక్కోసారి ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో ప్రజాధనం వృథా కావడంతో పాటు అభివృద్ధి పనుల్లో జాప్యం నెలకొంటుందని కేంద్రం భావిస్తోంది. ఈ మేరకు దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని చూస్తోంది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్​రెడ్డి వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పట్లో జమిలీ ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదని పలువురు విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

Telangana Assembly Elections | గతంలో పార్లమెంట్​తో పాటే..

ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్​ ఎన్నికలు (Parliamentary Elections) ఒకేసారి జరిగేవి. తెలంగాణ ఏర్పడిన తొలి ఎన్నికలు సైతం పార్లమెంట్​ ఎన్నికలతో పాటే నిర్వహించారు. అయితే 2018లో అప్పటి సీఎం కేసీఆర్​ ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. ఆరు నెలల ముందుగానే రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేశారు. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో నవంబర్​, డిసెంబర్​ నెలల్లో జరుగుతుండగా.. పార్లమెంట్ ఎలక్షన్లు ఏప్రిల్, మే నెలల్లో జరుగుతున్నాయి. ఏపీలో మాత్రం రెండు ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Indiramma Housing Scheme | ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి కీలక ప్రకటన.. రెండో విడతలో వారికి అవకాశం

Drugs Test | డ్రగ్స్​ టెస్టులకు నేను రెడీ : కేటీఆర్​
Tehran Oil Depot Fire | టెహ్రాన్​లోని Shehran Oil Depotలో భారీ పేలుళ్లు.. ఆకాశాన్ని తాకిన అగ్ని జ్వాలలు
Hyderabad Water Supply Disruption | పైప్​లైన్​ ధ్వంసం.. తాగునీటి సరఫరాలో అంతరాయం
High Protein Breakfast | గుడ్ల కంటే ఎక్కువ ప్రొటీన్ వీటిలోనే..అవి ఏంటో తెలుసా!
March 13 Gold Prices | బంగారం, వెండి ధరల్లో భారీ తగ్గుదల.. ప్రధాన నగరాల్లో తాజా పరిస్థితి ఇదే!
TAGGED:Assembly ElectionsBJPCentral GovernmentCM Revanth ReddyParliamentary ElectionsTelangana Assembly Elections
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article US Immigration Offer US Immigration Offer | అక్రమ వలసదారులకు అమెరికా ఆఫర్‌.. దేశం వీడితే 2,600 డాలర్లు..
Next Article  Car Fire Accident Car Fire Accident | రన్నింగ్ కారులో చెలరేగిన మంటలు..
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?