అక్షరటుడే, వెబ్డెస్క్: Telangana Budget 2026 | డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఈ ఏడాది రూ.3,24,234 కోట్లతో బడ్జెట్ రూపొందించారు. మూలధన వ్యయం రూ.47,267 కోట్లు, రెవెన్యూ వ్యయం రూ.2,34,406 కోట్లుగా కేటాయించారు.
బడ్జెట్ ప్రవేశ పెట్టిన అనంతరం డిప్యూటీ సీఎం భట్టి ప్రసంగించారు. తెలంగాణ వృద్ధి రేటు 8శాతంగా ఉందన్నారు. దేశ సగటు వృద్ధి రేటు కంటే 2.7 శాతం అధికంగా ఉందని తెలిపారు. దేశ జీడీపీలో రాష్ట్రం 5 శాతం వాటా కలిగి ఉందన్నారు. దేశ వృద్ధి రేటు మందగమనంలో ఉన్న తెలంగాణ (Telangana) వృద్ధి రేటులో పెరుగుదల కనిపిస్తోందన్నారు. రాష్ట్ర తలసరి ఆదాయం గణనీయంగా పెరిగిందని తెలిపారు. తలసరి ఆదాయం 4.18 లక్షలుగా ఉందని వివరించారు. ఇది దేశ సగటు కంటే భారీగా ఎక్కువ అన్నారు.
Telangana Budget 2026 | పెట్టుబడుల కోసం..
ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఆకర్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్ సమ్మిట్ (Global Summit) నిర్వహించిందని భట్టి విక్రమార్క తెలిపారు. ఎంతో మంది ప్రముఖులు ఈ సదస్సులో పాల్గొన్నారని చెప్పారు. దీంతో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చాయన్నారు. ఈ సమ్మిట్లో తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ను ఆవిష్కరించామన్నారు. ఈ సదస్సులో 100 వరకు ఒప్పందాలు జరిగాయని, సుమారు రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి పలు సంస్థలు ఆసక్తి కనబరిచాయన్నారు.
ఇది కూడా చదవండి..: Hyderabad Food Adulteration | కల్తీ మాఫియాపై ఉక్కుపాదం.. ప్రత్యేక బృందం ఏర్పాటు

