అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Telangana Budget 2026 | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్(Telangana Budget 2026) ప్రజానుకూలంగా ఉందని.. మైనారిటీల సంక్షేమం, సామాజిక న్యాయానికి ఊతమిచ్చేలా ఉందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ (Shabbir Ali) అన్నారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.
Telangana Budget 2026 | సమగ్రాభివృద్ధికి దోహదం..
ఈ బడ్జెట్ రైతులకు, ప్రజలకు అనుకూలంగా ఉండటంతో పాటు సమగ్ర అభివృద్ధికి (Telangana Government) దోహదపడుతుందని షబ్బీర్ అలీ పేర్కొన్నారు. మైనారిటీల సంక్షేమానికి (Minority Welfare India) రూ.3,769 కోట్లు కేటాయించడాన్ని స్వాగతించారు. ఇది వారి సమగ్ర అభివృద్ధి, సమాన అవకాశాల పట్ల ప్రభుత్వ నిబద్ధతను ప్రతిబింబిస్తుందన్నారు. గతేడాదితో పోలిస్తే రూ.178 కోట్ల పెరుగుదల ఉండడం, మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను సూచిస్తుందని తెలిపారు.
Telangana Budget 2026 | మైనారిటీ మహిళలకు..
మైనారిటీ మహిళలకు 10,000 కుట్టు మెషిన్ల పంపిణీ, 4,655 మంది మైనారిటీ యువతకు నైపుణ్య అభివృద్ధి శిక్షణ వంటి కార్యక్రమాలు ఆర్థిక స్వావలంబనను పెంపొందించడంలో సాయపడతాయని ప్రభుత్వ సలహాదారు అన్నారు. ఉపాధి అవకాశాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు. బడ్జెట్‌లో మైనారిటీలను సంక్షేమ ప్రణాళికల కేంద్రంగా ఉంచి, విద్య, వ్యాపారాభివృద్ధి, ఆర్థిక స్వతంత్రతపై ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు.
Telangana Budget 2026 | రాజీవ్ యువ వికాసం..
రాజీవ్ యువ వికాసం పథకానికి రూ.6 వేల కోట్లు కేటాయించడం పట్ల కూడా (Social Justice Budget) షబ్బీర్‌అలీ హర్షం వ్యక్తం చేశారు. ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల యువతకు ఆర్థిక సహాయం అందించి స్వయం ఉపాధి అవకాశాలు కల్పించబడతాయన్నారు. విద్యకు ప్రాధాన్యతనిస్తూ ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్’ (Young India Integrated Residential Schools) కార్యక్రమాన్ని ఆయన ప్రశంసించారు. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 105 పాఠశాలలు ఏర్పాటు చేయబడుతున్నాయని, అందులో 79 పాఠశాలలకు అనుమతులు లభించగా, 44 చోట్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.
ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు..
అదే విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమానికి రూ.36,000 కోట్లకు పైగా కేటాయించడం(Revanth Reddy) పట్ల షబ్బీర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఇందులో ఎస్సీలకు రూ.11,784 కోట్లు, ఎస్టీలకు రూ.7,937 కోట్లు, బీసీలకు రూ.12,511 కోట్లు కేటాయించడం సామాజిక న్యాయం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న ఎస్సీ/ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల విడుదలతో పాటు విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కార్యక్రమాల విస్తరణ ద్వారా చారిత్రక అసమానతలను తగ్గించి, వెనుకబడిన వర్గాలకు ప్రయోజనాలు చేరేలా చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
డిప్యూటీ సీఎంపై ప్రశంసల జల్లు..
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను( Bhatti Vikramarka) ప్రశంసిస్తూ.. ఈ బడ్జెట్ సంక్షేమం, అభివృద్ధి మధ్య సమతుల్యతను సాధించిందని, రైతులు, బలహీన వర్గాలు, యువతకు ప్రాధాన్యతనిచ్చిందని షబ్బీర్ అలీ అన్నారు. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజన్‌కు అనుగుణంగా సమగ్ర పాలనకు (India Budget News) కొనసాగింపని పేర్కొన్నారు. ఇది రైతులకు, ప్రజలకు అనుకూలమైన బడ్జెట్. సామాజిక న్యాయాన్ని బలపరుస్తూ, ముఖ్యంగా మైనారిటీలు, వెనుకబడిన వర్గాలకు సమాన అవకాశాలు కల్పించే దిశగా ముందడుగు వేస్తోందని షబ్బీర్ అలీ తెలిపారు.
ఇది కూడా చదవండి: Mopal Police Inspection | మోపాల్ పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేసిన సీపీ సాయిచైతన్య

