అక్షరటుడే, వెబ్‌డెస్క్: Telangana Control Room | పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్ రూం ఏర్పాటు చేసింది. న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్ (Telangana Bhavan)లో దీనిని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.ఇరాన్ గల్ఫ్ దేశాలపై పెద్ద ఎత్తున దాడులు చేస్తోంది.
గల్ఫ్ దేశాల్లో ఎంతో మంది తెలంగాణ పౌరులు నివసిస్తున్నారు. ఇక్కడ ఉన్న వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ పౌరుల కోసం ప్రభుత్వం కంట్రోల్ రూం ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో గల సీనియర్ అధికారులు పరిస్థితిని విదేశాంగ మంత్రిత్వ శాఖ (Foreign Affairs Ministry), భారత ప్రభుత్వం, సంబంధిత భారత రాయబార కార్యాలయాలతో (Indian Embassies) నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు.

Telangana Control Room | సాయం కోసం
ప్రభావిత దేశాలలో నివసిస్తున్న తెలంగాణ పౌరులు, చిక్కుకుపోయిన వారు, వారి కుటుంబ సభ్యుల నుంచి వస్తున్న వినతులతో ప్రభుత్వం తెలంగాణ భవన్‌లో 24×7 కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. అవసరమైన సమన్వయాన్ని సులభతరం చేయడానికి, అవసరమైన విధంగా సహాయం అందించడానికి కంట్రోల్ రూమ్ 24 గంటలూ పనిచేస్తుంది. ప్రస్తుతం ఉద్రిక్తతలు నెలకొన్న దేశాల్లో నివసిస్తున్న తెలంగాణ పౌరులు, తెలంగాణ (Telangana)లోని వారి కుటుంబ సభ్యులు ఇబ్బందులు, ప్రయాణ అంతరాయాలు లేదా ఇతర అత్యవసర పరిస్థితులలో కంట్రోల్ రూమ్‌ను సంప్రదించవచ్చు.
Telangana Control Room | కంట్రోల్ రూమ్ నంబర్లు
వందన బారువా 9871999044, సి.హెచ్. చక్రవర్తి 9958322143, జావేద్ హుస్సేన్ 9910014749, రక్షిత్ నాయక్ 9643723157. రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితిని గమనిస్తోందని అధికారులు తెలిపారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ సమన్వయంతో అవసరమైన సాయం చేస్తుందన్నారు.
ఇది కూడా చదవండి..: Annaram Barrage Controversy | అన్నారం బ్యారేజీ కూల్చేందుకు కుట్ర.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

