అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Telangana Education Budget | విద్యార్థులకు చదువులను దూరం చేసే బడ్జెట్ ఇది అని ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి రఘురాం నాయక్ అన్నారు. ఈ మేరకు నగరంలోని అఖిల భారత విద్యార్థి సమాఖ్య (All India Students Federation) నిజామాబాద్ జిల్లా సమితి ఆధ్వర్యంలో నగరంలోని రైల్వేస్టేషన్ వద్ద కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు నిరసనగా పుస్తకాలు, చెవుల్లో పూలు పెట్టుకొని నిరసన తెలిపారు.
Telangana Education Budget | విద్యారంగానికి తీరని లోటు..
ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి రఘురాం నాయక్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం (State Government) ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యారంగానికి కేవలం రూ.26.674 వేల కోట్లు కేటాయించి బడ్జెట్లో విద్యారంగానికి తీరని అన్యాయం చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) ఎన్నికలప్పుడు విద్యారంగానికి పూర్తిస్థాయి అభివృద్ధికి దోహదపడుతామని చెప్పి విద్యారంగానికి సరిపోని బడ్జెట్ కేటాయించారన్నారు.
Telangana Education Budget | ఈ నిధులు ఎటూ సరిపోవు..
ప్రభుత్వం విద్యారంగానికి ఇచ్చిన బడ్జెట్ ప్రభుత్వ బడుల్లో, సంక్షేమ హాస్టళ్లలో, జూనియర్, డిగ్రీ కాలేజీలు, యూనివర్సిటీ స్థాయిల్లో అభివృద్ధికి ఏమాత్రం సరిపోదని రఘురాం నాయక్ అన్నారు. టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేసే విధంగా ఈ ప్రభుత్వం విద్యా రంగంప్తె దృష్టి మాత్రం పెట్టడం లేదని విమర్శించారు. ఈ బడ్జెడ్‌లో విద్యారంగానికి కేటాయించినటువంటి బడ్జెట్ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడా సరిపోదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా బడ్జెట్ ప్రవేశపెట్టేముందు విద్యారంగానికి సంబంధించి మేధావులతో, అదేవిధంగా విద్యార్థి సంఘాలతో చర్చించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు సుబోధ్, జిల్లా ఉపాధ్యక్షుడు కుశాల్ దేవ్, నాయకులు రంజిత్, శివ , కమల్, ఈశ్వర్ ప్రసాద్ పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Ramzan celebrations MLAs | రంజాన్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యేలు..

