Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Telangana Education Commission | పని చేస్తేనే పదోన్నతులు : తెలంగాణ విద్యా కమిషన్
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Telangana Education Commission | పని చేస్తేనే పదోన్నతులు : తెలంగాణ విద్యా కమిషన్

తెలంగాణతాజా వార్తలు

Telangana Education Commission | పని చేస్తేనే పదోన్నతులు : తెలంగాణ విద్యా కమిషన్

విద్యా విధానంలో పలు మార్పులు సూచిస్తూ.. తెలంగాణ విద్యా కమిషన్​ పలు సిఫార్సులు చేసింది. ఈ మేరకు గురువారం తన నివేదికను ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డికి సమర్పించింది.

Srinivas kolluri
Last updated: ఫిబ్రవరి 27, 2026 7:36 ఉద.
Srinivas Kolluri
4 వారాలు ago
Share
Telangana Education Commission
Telangana Education Commission

అక్షరటుడే, హైదరాబాద్​: Telangana Education Commission | ఉపాధ్యాయులకు ఆటోమేటిక్ పదోన్నతులు అనేవి ఉండకూడదని తెలంగాణ విద్యా కమిషన్ అభిప్రాయపడింది. ఉపాధ్యాయుల పని తీరు ఆధారంగానే పదోన్నతులు కల్పించాలని సూచించింది. తెలంగాణ విద్యా కమిషన్ తన నివేదికను గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమర్పించింది. విద్యా విధానం పూర్తిగా విద్యార్థి కేంద్రీకృతంగా సాగాలని సిఫార్సు చేసింది.

Contents
  •  Telangana Education Commission | కమిషన్ నివేదికలోని ముఖ్యాంశాలు
      • Telangana Education Commission | త్రిభాష విధానం
      • Telangana Education Commission | బోర్డుల విలీనం

 Telangana Education Commission | కమిషన్ నివేదికలోని ముఖ్యాంశాలు

ఉపాధ్యాయుల పని తీరును ప్రతి అయిదేళ్లకోసారి అంచనా వేయాలి. దాని ఆధారంగా ఒక నివేదిక అందజేయాలి. పని తీరు మెరుగుపర్చుకోవడానికి రెండేళ్లు సమయం ఇవ్వాలి. అప్పటికీ మెరుగుపడకపోతే వారిని సర్వీసు నుంచి తొలగించాలి. పని తీరు మెరుగ్గా ఉంటే పదోన్నతులు ఇవ్వాలి.. అయితే ఇప్పటికే సర్వీసులో ఉన్న వారికి ఇవి వర్తించవు. ఇకపై రిక్రూట్​ చేసుకునేవారికి వర్తింపజేయాలి.

డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యకేషన్‌ పూర్తిగా రద్దు చేయాలి.. బీఎడ్‌ను పునర్వవ్యవస్థీకరించాలి. నర్సరీ నుంచి ఐదో తరగతి వరకు బీఎడ్ (ప్రైమరీ), ఆరో తరగతి నుంచి 12వ తరగతి వరకు బీఎడ్ (సెకండరీ) తీసుకురావాలి. ఇందుకు ఎన్సీటీఈతో సమన్వయం కావాలి. బీఎడ్ విద్యార్థులకు బడుల్లో 150 రోజుల బోధనాభ్యసం తప్పని సరి చేయాలి. నర్సరీ నుంచి యూనివర్సిటీల వరకు బోధన మాధ్య మం ఆంగ్లంలో ఉండాలి.

 Telangana Education Commission
Telangana Education Commission

Telangana Education Commission | త్రిభాష విధానం

త్రిభాష విధానం ఒకటో తరగతి నుంచే అమలు చేయడం ఉత్తమం. తెలుగు/ఉర్దూ, ఇంగ్లీష్, హిందీ బోధించాలి. పూర్వ ప్రాథమిక విద్యను (నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ) ప్రాథమిక పాఠశాలల్లో అందజేయాలి. పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు, సిబ్బంది నియా మకం, వసతుల కల్పన, నాణ్యతా ప్రమాణాల పర్యవేక్షణకు స్కూల్ డిస్ట్రిక్లను ఏర్పాటు చేయాలి. వంట వండే మహిళలకు వారానికి ఒకసారి చెల్లింపులు చేయాలి. మధ్యాహ్న భోజన అంచనాలు, ప్రతిపాదనలు, చెల్లింపుల కోసం సమగ్ర సాఫ్ట్‌వేర్ వాడాలి.

కోచింగ్ సెంటర్లు, హాస్టళ్లను నియంత్రించేందుకు చట్ట సవరణ చేయాలి. ఫీజులు, మౌలిక సదుపాయాలు, అధ్యాపకులు, పాఠ్య ప్రణాళిక, విద్యా ర్థుల మానసిక ఆరోగ్యం, తప్పుదారి పట్టించే ప్రకటనలపై నియంత్రణ అవసరం.. ప్రైవేటు జూనియర్ కళాశాలల నుంచి వేరుగా పోటీ పరీక్షల కోచింగ్‌ను వేరు చేయాలి. 12వ తరగతిలో మాత్రమే బోర్డు ఎగ్జామ్స్ నిర్వహించాలి.. ఎప్‌సెట్‌ను రద్దు చేసి ఇంజినీరింగ్, వ్యవసాయం, ఫార్మసీ ప్రవేశాలు 12వ తరగతి మార్కుల ఆధారంగా కేటాయించాలి.

Telangana Education Commission | బోర్డుల విలీనం

ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్ బోర్డులను విలీనం చేయాలి. విద్యా ప్రమాణాలు మెరుగుపర్చడానికి కనిష్ట ఉత్తీర్ణత శాతాన్ని 45 శాతానికి పెంచాలి. విశ్వ విద్యాలయాల కార్యనిర్వాహక మండలిని పునర్నిర్మించాలి.. దానికి వైస్ ఛాన్సలర్ ఛైర్మన్‌గా ఉండాలి.. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ల నియామకం రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ, యూజీసీ నామిని, ముగ్గురు రిటైర్డ్ వైస్ ఛాన్సలర్లతో కూడిన సెర్చ్ కమిటీ ద్వారా పారదర్శకంగా జరగాలి.

యూనివర్సిటీల్లో సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని రద్దు చేయాలి… విద్యార్థుల నుంచి డిమాండ్ ఉన్న సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను రెగ్యులర్ కోర్సులుగా మార్చాలి. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విద్యాలయాన్ని బహుళ-విభాగంగా అభివృద్ధి చేయాలి.. ప్రతి డిగ్రీ కాలేజీకి అనుబంధంగా 200 మంది అతి పేద విద్యార్థులకు హాస్టల్‌ను ఏర్పాటు చేయాలి.

ఇది కూడా చదవండి: Arudra Nakshatra Significance | ఆ‘రుద్ర’ నక్షత్రాన.. శివాభిషేకంతో విశేష ఫలాలు

Iran Amazon Data Center | అమెజాన్​ డేటా సెంటర్​పై ఇరాన్​ దాడి
Intermediate exam fear | ఇంటర్​లో ఫెయిల్​ అవుతాననే భయంతో విద్యార్థి ఆత్మహత్య
ISRO YUVIKA 2026 | విద్యార్థులకు సూపర్​ ఛాన్స్​.. ఇస్రో ‘యువిక 2026’ రిజిస్ట్రేషన్లు షురూ..
Crude Oil Effect | క్రూడ్ ఆయిల్ ఎఫెక్ట్.. స్టాక్ మార్కెట్‌లో భారీ పతనం
Married Woman | అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి!
TAGGED:Telangana Education Commission
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Feb 27 Horoscope | Feb 27 Horoscope | వైవాహిక జీవితం ఎంతో మధురం.. నేడు ఈ రాశుల వారికి మరిచిపోలేని రోజు!
Next Article february 27 gold price | పసిడి పరుగులకు బ్రేక్.. తులంపై రూ.870 తగ్గుద‌ల‌! february 27 gold price | పసిడి పరుగులకు బ్రేక్.. తులంపై రూ.870 తగ్గుద‌ల‌!
5 వ్యాఖ్యలు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?