Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Telangana Education Commission | విద్యా కమిషన్ ఇచ్చిన సిఫార్సులు అశాస్త్రీయం..: టీపీటీఫ్​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Telangana Education Commission | విద్యా కమిషన్ ఇచ్చిన సిఫార్సులు అశాస్త్రీయం..: టీపీటీఫ్​

నిజామాబాద్

Telangana Education Commission | విద్యా కమిషన్ ఇచ్చిన సిఫార్సులు అశాస్త్రీయం..: టీపీటీఫ్​

తెలంగాణ విద్యావిధానం పేరుతో విద్యా కమిషన్ ఇచ్చిన సిఫార్సులు పూర్తిగా అశాస్త్రీయంగా ఉన్నాయని టీపీటీఎఫ్​ నిజామాబాద్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వెనిగళ్ల సురేష్, అర్వింద్​ పేర్కొన్నారు.

Srinivas kolluri
Last updated: మార్చి 7, 2026 4:23 సా.
Srinivas Kolluri
3 వారాలు ago
Share
Telangana Education Commission
Telangana Education Commission

అక్షరటుడే, ఇందూరు: Telangana Education Commission | తెలంగాణ విద్యావిధానం పేరుతో విద్యా కమిషన్ ఇచ్చిన సిఫార్సులు పూర్తిగా అశాస్త్రీయంగా ఉన్నాయని టీపీటీఎఫ్​ నిజామాబాద్ జిల్లా (Nizamabad District) అధ్యక్ష, కార్యదర్శులు వెనిగళ్ల సురేష్, అర్వింద్​ పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం పత్రిక ప్రకటన విడుదల చేశారు.

Contents
  • Telangana Education Commission | ఉపాధ్యాయుల వేతనాలు ఎక్కువ అని మాట్లాడడం సరికాదు..
    • Telangana Education Commission | ప్రాథమిక పాఠశాలలకు అనుసంధానం..
      • Telangana Education Commission | నిబంధనల మేరకే వేతనాలు..
      • Telangana Education Commission | ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయాలి

Telangana Education Commission | ఉపాధ్యాయుల వేతనాలు ఎక్కువ అని మాట్లాడడం సరికాదు..

రాష్ట్రంలో ఉపాధ్యాయుల వేతనాలు ఎక్కువ అని వ్యాఖ్యానించడం సరికాదని టీపీటీఎఫ్​ ప్రతినిధులు అన్నారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)కి తెలంగాణ విద్యావిధానం పేరుతో సమర్పించిన రిపోర్టులో ఒకటో తరగతి నుంచి మూడు భాషల విద్యా విధానం ప్రవేశపెడతామని పేర్కొనడం విద్యార్థులపై భారం మోపడమేనన్నారు. ఆ రిపోర్టులో కొన్ని అంశాలు అసంబద్ధంగా ఉన్నాయని వాటిని సరిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. విద్యాకమిషన్ గ్రామీణ వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాల సూచనలు పరిగణనలోకి తీసుకోకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు. గ్రామీణ పాఠశాలలను కుదిస్తూ మండలానికి ఒకటి లేదా రెండు ఫౌండేషన్ పబ్లిక్ స్కూళ్లను ఏర్పాటు చేస్తూ విద్యను కేంద్రీకరణ చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. విద్యాకమిషన్ రిపోర్టు ప్రభుత్వ పాఠశాలను కుదిస్తూ ప్రైవేట్ కార్పొరేట్ విద్యను ప్రోత్సహించేలా ఉందని వారు ఆరోపించారు.

Telangana Education Commission | ప్రాథమిక పాఠశాలలకు అనుసంధానం..

పూర్వ ప్రాథమిక విద్యను ప్రాథమిక పాఠశాలలకు అనుసంధానం చేయడం ఆహ్వానించదగ్గ విషయమైనప్పటికీ సుశిక్షుతులైన ఉపాధ్యాయుల కొరత ఉందని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రత్యేక కళాశాలల ద్వారా కాంట్రాక్టు పద్ధతిలో కాకుండా పర్మినెంట్ పద్ధతిలో ఉపాధ్యాయుల నియమించాలని వారు డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల ప్రమోషన్లు, సర్వీసు, సేవలను బట్టి కాకుండా ప్రతిభ ఆధారంగా ఇస్తామనడం అనేక ప్రతికూల అంశాలకు దారితీస్తాయన్నారు. అదేవిధంగా పదోతరగతి ఇంటర్మీడియట్ బోర్డులను విలీనం చేసే ప్రక్రియలో ఎదురయ్యేటటువంటి ప్రతికూల అంశాలను లోతుగా చర్చించాలన్నారు.

Telangana Education Commission

Telangana Education Commission | నిబంధనల మేరకే వేతనాలు..

రాష్ట్రంలో ఉపాధ్యాయుల వేతనాలు ఎక్కువగా ఉన్నాయని వ్యాఖ్యానించడం సరికాదని.. ఉపాధ్యాయుల అర్హతలు, సేవలు, పే కమిషన్ సిఫార్సుల ప్రకారమే ఇతర ఉద్యోగులతో పాటు ఉపాధ్యాయుల వేతనాలు కూడా నిర్ణయించబడతాయన్నారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్ (Telangana Public School) పేరుతో కొన్ని గ్రామాల్లోని పాఠశాలను విలీనం చేసి, ఆయా గ్రామాల్లో బడులు లేకుండా చేసి, బస్సుల ద్వారా విద్యార్థులను పాఠశాలకు తీసుకురావడం సరైన పద్ధతి కాదన్నారు. ప్రస్తుతం నిర్వహించబడుతున్న అన్ని ప్రాథమిక, ఉన్నత పాఠశాలను సెమి రెసిడెన్షియల్ పాఠశాలలుగా మార్చాలని వారు కోరారు.

Telangana Education Commission | ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయాలి

విద్యాశాఖలో ఉపాధ్యాయ ఖాళీపోస్టులను ఎప్పటికప్పుడు భర్తీ చేస్తూ, సర్వీస్​ రూల్స్ సమస్యను పరిష్కరించి పర్యవేక్షణ విధానాన్ని మెరుగుపర్చాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం నిబంధనలు పాటించని ప్రైవేటు పాఠశాలలను కూడా మూసివేయాలన్నారు. విద్యకు బడ్జెట్ కేటాయింపుల పెంపు, మధ్యాహ్న భోజనం ధరల పెంపు, సత్వర చెల్లింపులు, యూనివర్సిటీలకు స్వయం ప్రతిపత్తి, ఎప్పటికప్పుడు ఖాళీల భర్తీ, నిధుల కేటాయింపు, కళాశాల్లో విద్యార్థి ఎన్నికలు, ప్రైవేటు రంగంలో ఫీజులను నియంత్రణ వంటి అనేక స్వాగతించాల్సిన అంశాలు ఉన్నాయని వాటిని అమలుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయాలని కోరారు.

ఇది కూడా చదవండి..: PDSU National Committee | పీడీఎస్​యూ జాతీయ కమిటీ సభ్యుడిగా అనుముల రవీందర్

Ramzan fasting benefits | ఉపవాసంతో సహనం, క్రమశిక్షణ పెరుగుతాయి: సీపీ సాయిచైతన్య
CP Saichaitanya Iftar | ఇఫ్తార్​ విందులో పాల్గొన్న సీపీ సాయిచైతన్య
Indur Tirumala Brahmotsavam | ఇందూరు తిరుమలలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు
SSC Exam Rules | ఎస్సెస్సీ పరీక్షల్లో నిర్లక్ష్యం చేస్తే.. సస్పెన్షన్​ కంటే కఠినచర్యలు: కలెక్టర్​ ఇలా త్రిపాఠి
LPG Cylinders Seized | కామారెడ్డిలో 31 ఎల్పీజీ సిలిండర్లు స్వాధీనం
TAGGED:CM Revanth ReddyNizamabad DistrictTelangana Education CommissionTelangana Public School
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Urea Shortage Urea Shortage | యూరియా కోసం అన్నదాతల కష్టాలు.. చెప్పులతో క్యూలైన్​..
Next Article Maoists Surrender Revanth Reddy Maoists Surrender Revanth Reddy | అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులందరూ లొంగిపోవాలి: సీఎం రేవంత్​రెడ్డి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?