అక్షరటుడే, వెబ్డెస్క్: Telangana Engineering Fees | రాష్ట్రంలో ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల (Private Engineering Colleges) ఫీజులను ప్రభుత్వం ఖరారు చేసింది. ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి కాలేజీ ఫీజులను ప్రభుత్వం మారుస్తుంది. ఇందులో భాగంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి మూడేళ్ల పాటు ఆయా కాలేజీల్లో ఫీజులను నిర్ణయించింది.
తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ(టీఏఎఫ్ఆర్సీ) సిఫార్సులను ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు 160 కాలేజీల ఫీజులను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పలు కాలేజీల ఫీజులను పెంచగా.. మరికొన్ని కళశాలల ఫీజులను ప్రభుత్వం తగ్గించింది.
Telangana Engineering Fees | రూ.45 వేలు
రాష్ట్రంలో 19 కాలేజీల్లో వార్షిక ఫీజు రూ.45 వేలుగా ప్రభుత్వం నిర్ణయించింది. ఆయా కాలేజీల్లో వసతులు, అధ్యాపకులు, ఇతర సదుపాయాల ఆధారంగా ప్రభుత్వం ఫీజులను నిర్ణయిస్తుంది. ఇందులో భాగంగా తాజాగా కొన్ని కాలేజీల ఫీజులను తగ్గించడం గమనార్హం. గతంలో కనిష్ట ఫీజు రూ.60 వేలు ఉండగా.. ఇప్పుడు రూ.45 వేలకు తగ్గింది. రాష్ట్రంలో 126 కాలేజీల్లో ఫీజు లక్షలోపే ఉంది. 34 కాలేజీల్లో మాత్రమే రూ.లక్షలకు మించి ఉంది. 70 కాలేజీల్లో పాత ఫీజునే కొనసాగించగా.. 63 కాలేజీల్లో ఫీజులు పెరిగాయి. 27 కాలేజీల్లో ఫీజులు తగ్గడం గమనార్హం.
Telangana Engineering Fees | కఠిన చర్యలు తీసుకుంటాం
ప్రస్తుతం విద్యార్థుల నుంచి ఇంజినీరింగ్ కాలేజీలు (Engineering Colleges) రెండు విడతల్లో ఫీజులను వసూలు చేస్తున్నాయి. కొన్ని కాలేజీలు ఒకే సారి చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ట్యూషన్ ఫీజును వీలును బట్టి వాయిదాల పద్ధతిలో చెల్లించేందుకు అవకాశం కల్పించింది. విరాళాలు, డోనేషన్ల పేరిట అదనంగా ఒక్క రూపాయి వసూలు చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఆయా ఇంజినీరింగ్ కళాశాలలు సమర్పించిన ఆదాయ, వ్యయాల లెక్కల ఆధారంగా ఫీజులు ఖరారు చేశామని, అవి తప్పని తేలితే ఫీజులు తగ్గిస్తామని హెచ్చరించారు. కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

Telangana Engineering Fees | అత్యధిక ఫీజు ఉన్న కాలేజీలు
సీబీఐటీ రూ. 1,83,000, వాసవి రూ. 1,75,000, ఎంజీఐటీ రూ. 1,67,000, సీవీఆర్ రూ.1,63,000, నారాయణమ్మ కాలేజీ రూ.1,62,000. గోకరాజు గంగరాజు ఇంజినీరింగ్ కాలేజీ ఫీజు రూ.1,60,500, వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి రూ.1,59,600, కిట్స్ రూ.1,46,200, బీబీఆర్ఐటీ రూ.1,46,600, ఎంవీఎస్ఆర్ రూ. 1,43,800.
ఇది కూడా చదవండి..: Rajya Sabha Nomination | రాజ్యసభ అభ్యర్థులుగా అభిషేక్ సింఘ్వీ, వేం నరేందర్‌రెడ్డి నామినేషన్

