అక్షరటుడే, వెబ్డెస్క్ : Telangana Hailstorm Rain | తెలంగాణలోని పలు జిల్లాల్లో సోమవారం సాయంత్రం వాన దంచికొట్టింది. మొన్నటి వరకు ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అయిన ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. అయితే అకాల వర్షాలతో అన్నదాతలు ఆగం అవుతున్నారు.
మెదక్ (Medak), కామారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట (Siddipet) జిల్లాల్లో సోమవారం సాయంత్రం వడగళ్ల వాన కురిసింది. సాయంత్రం వరకు వేడిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. సాయంత్రం 6 గంటలకు ఈదురుగాలులతో కూడిన వర్షం ప్రారంభం అయింది. అర్ధ గంట సేపు వాన దంచికొట్టింది. పెద్ద సైజులో వడగళ్లు కురిశాయి. ఈదురుగాలులకు పలు చోట్ల చెట్లు నేలకొరిగాయి. దీంతో కొన్ని గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
Telangana Hailstorm Rain | హవేళి ఘన్పూర్ మండలంలో..
మెదక్ జిల్లా హవేళి ఘన్పూర్ మండలంలో భారీ వర్షం కురిసింది. పెద్ద పెద్ద వడగళ్లు పడటంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. మీద పడితే దెబ్బ తగిలే సైజులో వడగళ్లు పడ్డాయి. కామారెడ్డి జిల్లా జుక్కల్ (Jukkal), నాగిరెడ్డిపేట (Nagireddypet) మండలాల్లో సైతం వర్షం కురిసింది.

Telangana Hailstorm Rain | అకాల వర్షాలతో..
అకాల వర్షాలతో అన్నదాతలు (Farmers) ఆందోళన చెందుతున్నారు. ఆదివారం కొన్ని చినుకులు పడిపోయింది. సోమవారం మాత్రం వాన దంచికొట్టడంతో పంటలు దెబ్బతింటాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వరి పంట ఈనిక, పొట్ట దశలో ఉంది. ఈ సమయంలో గాలివాన, వడగళ్ల వానతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఈదురుగాలులకు పంట నేలకొరిగే అవకాశం ఉంది.
దీనిని కూడా చదవండి : Rythu Bharosa Funds | రైతులకు గుడ్న్యూస్.. 22న రైతు భరోసా నిధుల విడుదల

