అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Telangana Heat Wave | రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరగనుంది. వారం రోజులుగా అకాల వర్షాలతో వాతావరణం కాస్త చల్లబడింది. దీంతో ఉక్కపోత నుంచి ఉపశమనం లభించింది. గురువారం నుంచి ఉష్ణోగ్రతలు మళ్లీ పెరుగుతాయని వాతావరణ శాఖ అధికారులు (Meteorological Department Officers) హెచ్చరించారు.
తెలంగాణ (Telangana) వ్యాప్తంగా మార్చి ప్రారంభం నుంచే ఎండలు దంచికొట్టాయి. రికార్డు స్థాయిలో టెంపరేచర్ నమోదు అయింది. మధ్యాహ్నం పూట కాలు బయట పెట్టలేని పరిస్థితి. ఈ క్రమంలో మార్చి 16 నుంచి అకాల వర్షాలు పడ్డాయి. దీంతో ఎండలు కాస్త తగ్గాయి. అయితే మళ్లీ భానుడు తన ప్రతాపం చూపడానికి సిద్ధం అయ్యాడు.
Telangana Heat Wave | ఆ జిల్లాలకు అలెర్ట్
తెలంగాణ రాష్ట్రం అంతటా నేటి నుంచి ఉష్ణోగ్రతలు (Temperatures) పెరుగుతాయి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో గురువారం 39-41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో ఈ రోజు 38-39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయి.
Telangana Heat Wave | పలు జిల్లాలకు వర్షసూచన
అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీవ్రమైన ఎండల కారణంగా వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, నారాయణపేట, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో సాయంత్రం నుంచి రాత్రి వేళల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ నగరంలో సాయంత్రం వేళల్లో చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. మిగిలిన సమయమంతా వాతావరణం పొడిగా ఉంటుంది.
ఇది కూడా చదవండి..: Telangana Assembly Clash | అసెంబ్లీలో ఇప్పసారా రగడ.. మంత్రి పొన్నం – ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డి మాటల యుద్ధం!

