Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Telangana Heatwave | హీట్​వేవ్​ అలెర్ట్​.. మండనున్న ఎండలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Telangana Heatwave | హీట్​వేవ్​ అలెర్ట్​.. మండనున్న ఎండలు

తెలంగాణ

Telangana Heatwave | హీట్​వేవ్​ అలెర్ట్​.. మండనున్న ఎండలు

రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరగనుంది. ఈ నెల 12 నుంచి 22 వరకు ఉష్ణోగ్రతలు భారీగా నమోదు అవుతాయని అధికారులు తెలిపారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 9, 2026 3:43 సా.
Srinivas Kolluri
2 గంటలు ago
Share
Telangana Heatwave

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Telangana Heatwave | రాష్ట్రంలో ఎండలు మండనున్నాయి. ఈ నెల 12 నుంచి రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత (Temperature)లు నమోదు అవుతాయని వాతావారణ శాఖ అధికారులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Contents
  • Telangana Heatwave | పది రోజుల పాటు
    • Telangana Heatwave | నీరు తాగాలి

ఈ వేసవి ప్రారంభం నుంచే ఎండలు దంచి కొడుతున్నాయి. అకాల వర్షాలు కురిసిన సమయంలో కాస్త చల్లబడ్డ భానుడు.. మిగతా సమయాల్లో తన ప్రతాపం చూపుతున్నాడు. దీంతో ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. ఏప్రిల్ 12 నుంచి 22 వరకు ఎండలు మరింత ఎక్కువగా ఉంటాయని అధికారులు హెచ్చరించారు.

Telangana Heatwave | పది రోజుల పాటు

రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 12 నుంచి 22 వరకు హీట్​వేవ్​ ప్రభావం ఉండనుంది. 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్​, ఉమ్మడి కరీంనగర్​, నిజామాబాద్​, వనపర్తి, గద్వాల్, ఉమ్మడి ఖమ్మం, ములుగు, భూపాలపల్లి, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో 42 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే ఛాన్స్​ ఉంది. హైదరాబాద్ (Hyderabad)​లో 40–41 డిగ్రీల మధ్య ఎండలు ఉండనున్నాయి. అక్కడక్కడ తేలిక పాటి వర్షాలు (Rains) కురిసే అవకాశం ఉంది. ఈ పది రోజుల పాటు వేడి గాలులు వీస్తాయి. ప్రజలు అప్రమత్తతంగా ఉండాలని అధికారులు సూచించారు.

Telangana Heatwave | నీరు తాగాలి

ఎండలు మండుతుండటంతో ప్రజలు జాగ్రత్తలు పాటించాలి. నీరు ఎక్కువగా తాగాలి. మధ్యాహ్నం సమయంలో అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లొద్దు. జంక్​ ఫుడ్​కు దూరంగా ఉండాలి. ఎండలో ఎక్కువ సేపు ఉండొద్దు. ఎండలో వెళ్లాల్సి వస్తే తలకు టోపి, రుమాల్​, స్కార్ఫ్​ వంటివి ధరించాలి. బయటకు వెళ్తున్న సమయంలో వెంట నీరు తీసుకెళ్లాలి. తెలంగాణ ప్రభుత్వం సైతం హీట్​ వేవ్​ నేపథ్యంలో అడ్వైజరీ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

 

HEATWAVE WARNING – APRIL 12-22 ⚠️🔥

Dear people of Telangana, get ready for a POWERFUL HEATWAVE from April 12 with entire Telangana will witness above 40°C heat

North, East TG in RED MARKED districts will be under SERIOUS HEAT with temperatures to cross 44°C at few parts… pic.twitter.com/sqONvwNlYD

— Telangana Weatherman (@balaji25_t) April 9, 2026

ఇది కూడా చదవండి : Cyber Scam | ఎమ్మెల్యేకు సైబర్​ నేరగాళ్ల టోకరా..

Annaram Barrage Controversy | అన్నారం బ్యారేజీ కూల్చేందుకు కుట్ర.. కేటీఆర్​ సంచలన వ్యాఖ్యలు
 Harish Rao Letter | ఇరిగేషన్​ మంత్రి ఉత్తమ్​కు హరీశ్​రావు లేఖ
KTR on Six Guarantees | ఆరు గ్యారంటీలపై అసెంబ్లీలో నిలదీస్తాం : కేటీఆర్​
Warangal ACB Raids | వరంగల్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు
Tank Bund Shiva | ట్యాంక్ బండ్ ‘శివ’కు గుర్తింపు.. ప్రాణాలు కాపాడిన సేవకు ప్రభుత్వ సహాయం
TAGGED:April heatwaveclimate news Indiaheatwave alerthigh temperatureshyderabad weatherIndia summer heatTelangana weatherweather warning
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Harish Rao Harish Rao | ‘పొంగులేటి పొగరు తగ్గించుకో’.. హరీశ్​రావు సంచలన వ్యాఖ్యలు
Next Article Alur Gutpa Road Alur Gutpa Road | ఆలూర్​ నుంచి గుత్ప వరకు డబుల్​ రోడ్డు మంజూరు: ఎమ్మెల్యే రాకేశ్​​ రెడ్డి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?