Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Telangana Heavy Rains | రైతులకు అలెర్ట్​.. రాష్ట్రానికి భారీ వర్ష సూచన
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Telangana Heavy Rains | రైతులకు అలెర్ట్​.. రాష్ట్రానికి భారీ వర్ష సూచన

తెలంగాణ

Telangana Heavy Rains | రైతులకు అలెర్ట్​.. రాష్ట్రానికి భారీ వర్ష సూచన

రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Srinivas kolluri
Last updated: మార్చి 14, 2026 7:17 సా.
Srinivas Kolluri
2 వారాలు ago
Share
Telangana Heavy Rains

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Telangana Heavy Rains | రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. మధ్యాహ్నం పూట కాలు బయట పెట్టలేని పరిస్థితి. ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ (IMD) అధికారులు చల్లని కబురు చెప్పింది. రానున్న వారం రోజులు తెలంగాణ వ్యాప్తంగా అక్కడక్కడ మోస్తరు వర్షాలు (Rains) కురుస్తాయని అధికారులు తెలిపారు.

Contents
  • Telangana Heavy Rains | జాగ్రత్తగా ఉండాలి
    • Telangana Heavy Rains | ఈ జిల్లాల్లో..
      • Telangana Heavy Rains | ఆ రోజుల్లో అలెర్ట్​..

తెలంగాణలో మార్చి 16-20 తేదీల మధ్యలో చాలా జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు, బలమైన ఉరుములు, మెరుపులు, పిడుగులు, ఈదురుగాలులు, వడగళ్ల వానలు పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ నెల 18, 19 తేదీల్లో తీవ్రత అధికంగా ఉంటుంది. గాలివాన, ఈదురుగాలులు, వడగళ్ల వర్షాలు పడే ఛాన్స్​ ఉంది. రైతులు తమ పంటలను జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించారు. ముఖ్యంగా కోసిన పంటలను ఆరు బయట నిల్వ చేయొద్దు. ఆరు బయట ఉంటే టార్పాలిన్లు కప్పుకోవాలి.

Telangana Heavy Rains | జాగ్రత్తగా ఉండాలి

వర్షం కురిసే సమయంలో పిడుగులు పడే అవకాశం ఉంది. ప్రజలు ఇళ్లలోనే ఉండాలి. వర్షాలతో పాటు ఈదురుగాలులు వీస్తాయి. చెట్లు, విద్యుత్​ స్తంభాలు కూలిపోయే అవకాశం ఉంది. చెట్ల కింద నిలబడొద్దు. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.

crops

Telangana Heavy Rains | ఈ జిల్లాల్లో..

రాష్ట్రంలోని మెదక్ (Medak)​, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్​, రంగారెడ్డి, హైదరాబాద్​ జిల్లాల్లో ఈ నెల 15 నుంచి 17 మధ్య మోస్తరు నుంచి భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తాయి. 40-50 మి.మీ వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురుస్తాయి. హైదరాబాద్‌ (Hyderabad)లో మార్చి 16-17 తేదీలలో మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Telangana Heavy Rains | ఆ రోజుల్లో అలెర్ట్​..

రెండో దశలో మార్చి 18 నుంచి 20 వరకు వర్షాల తీవ్రత అధికంగా ఉండనుంది. ముఖ్యంగా సంగారెడ్డి, వికారాబాద్​, రంగారెడ్డి, హైదరాబాద్​, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, మహబూబ్​నగర్​, కొత్తగూడెం, వరంగల్​, ములుగు, జయశంకర్​ భూపాలపల్లి జిల్లాల్లో వానలు దంచికొట్టే ఛాన్స్​ ఉంది.

దీనిని కూడా చదవండి : Medak Road Accident | మెదక్​ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

Goa liquor smuggling | గోవా నుంచి మద్యం.. షాక్​ ఇచ్చిన పోలీసులు
Vikarabad Woman Constable Suicide | వికారాబాద్ జిల్లాలో విషాదం.. మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
Record Power Demand | రికార్డు స్థాయిలో విద్యుత్​ డిమాండ్​
Excise Constable Transfers | త్వరలో ఎక్సైజ్​ కానిస్టేబుళ్ల బదిలీలు : మంత్రి జూపల్లి
Indiramma houses second phase | ఇందిరమ్మ ఇళ్లపై కీలక ప్రకటన.. ఏప్రిల్​ 1 నుంచి రెండో విడత
TAGGED:farmers weather warningIndia weather forecastrain alertTelangana Heavy RainsTelangana weather alertthunderstorm alert Telanganaweather updates
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Kamareddy Children Death | Kamareddy Children Death | చిన్నారుల మిస్సింగ్​ విషాదాంతం.. బావిలో విగతజీవులుగా..
Next Article Kamareddy LPG Cylinder Raids | Kamareddy LPG Cylinder Raids | హోటళ్లు, వాణిజ్య సంస్థలపై సివిల్​ సప్లయ్​ అధికారుల దాడులు.. 30 డొమెస్టిక్​ సిలిండర్లు స్వాధీనం
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?