అక్షరటుడే, వెబ్డెస్క్ : Telangana Inter Results | ఇంటర్ ఫలితాల కోసం విద్యార్థులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో కీలక అప్డేట్ వచ్చింది. ఏప్రిల్ మొదటి వారంలో రిజల్ట్స్ విడుదల చేయనున్నట్లు సమాచారం.
తెలంగాణలో ఇంటర్ పరీక్షలు (Inter Exams) ఫిబ్రవరి 25 నుంచి మార్చి 13 వరకు సాగాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు కలిపి దాదాపు 9.8లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. మార్చి 15 నుంచి జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభించారు. ఈ ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఈ క్రమంలో ఏప్రిల్ 6న ఫలితాలు విడుదల చేస్తారని సమాచారం. ఒక వేళ ఆ రోజు వీలుకాకపోతే రెండో వారంలో ఫలితాలు వచ్చే ఛాన్స్ ఉంది. ఈ మేరకు ఇంటర్ బోర్డు (Inter Board) అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Telangana Inter Results | 10,426 కేంద్రాల్లో..
రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా సాగాయి. మొత్తం 10,426 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. ఎలాంటి అక్రమాలు, మాస్ కాపీయింగ్ జరగకుండా చర్యలు చేపట్టారు. పరీక్షలు అయిపోయి 15 రోజులు అవుతోంది. దీంతో విద్యార్థులు ఫలితాల కోసం నిరీక్షిస్తున్నారు. ఈ మేరకు అధికారులు సైతం ఫలితాలు త్వరలో విడుదల చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే పలు సబ్జెక్ట్ పేపర్ల మూల్యాంకనం అయిపోయినట్లు తెలుస్తోంది.
దీనిని కూడా చదవండి : Olympiad Education Benefits | విద్యార్థుల బంగారు భవితకు బాట.. ఒలంపియాడ్ విద్య..

