Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Telangana Law and Order | శాంతి భద్రతలు అదుపులో ఉంటేనే అభివృద్ధి : సీఎం రేవంత్​రెడ్డి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Telangana Law and Order | శాంతి భద్రతలు అదుపులో ఉంటేనే అభివృద్ధి : సీఎం రేవంత్​రెడ్డి

తెలంగాణ

Telangana Law and Order | శాంతి భద్రతలు అదుపులో ఉంటేనే అభివృద్ధి : సీఎం రేవంత్​రెడ్డి

శాంతి భద్రతలు అదుపులో ఉంటేనే అభివృద్ధి సాధ్యమని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. నేరాల నియంత్రణకు పోలీసులు అప్​గ్రేడ్​ కావాలన్నారు.

Srinivas kolluri
Last updated: మార్చి 9, 2026 8:56 సా.
Srinivas Kolluri
2 వారాలు ago
Share
Telangana Law and Order

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Telangana Law and Order | ఏ రాష్ట్రమైనా, దేశమైనా అభివృద్ధి చెందాలంటే ఆయా ప్రాంతాల్లో శాంతిభద్రతలు అదుపులో ఉండాలని సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. శాంతి భద్రతలు లేకపోతే పెట్టుబడులు రావన్నారు. తెలంగాణ పోలీస్​ అకాడమీలో పోలీస్ ఆఫీసర్స్ రిట్రీట్-2026 (Police Officers Retreat-2026)లో ఆయన పాల్గొన్నారు.

Contents
  • Telangana Law and Order | నేరాల స్వభావం మారింది
    • Telangana Law and Order | అప్​గ్రేడ్​ చేయాలి

ప్రజలకు మెరుగైన సేవలను అందించడంలో పోలీసు అధికారుల కృషిని సీఎం రేవంత్​రెడ్డి ప్రశంసించారు. రిట్రీట్ ద్వారా అధికారులు సవాళ్లు, సమస్యలు సాధ్యమైన పరిష్కారాలను విశ్లేషించారు. శాంతిభద్రతలు అభివృద్ధికి పునాది అని, శాంతి భద్రతలను కాపాడుకోకుండా ఏ రాష్ట్రం కూడా పురోగతి సాధించలేదని పేర్కొన్నారు. పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్‌ (ORR)లోని 2,100 కి.మీ. ప్రాంతాన్ని కోర్ అర్బన్ రీజియన్‌గా పరిగణిస్తోందన్నారు. ఆర్థిక వృద్ధి, మౌలిక సదుపాయాలపై దృష్టి సారించిందన్నారు.

Telangana Law and Order | నేరాల స్వభావం మారింది

ఏదైనా సంక్షోభంలో ప్రజలు మొదట పోలీసుల సహాయం కోసం చూస్తారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పోలీసు వ్యవస్థ ప్రజల విశ్వాసం, పాలనకు కీలకంగా మారుతుందన్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి, అంతర్గత భద్రతను నిర్వహించడానికి ఆక్టోపస్ (Octopus), గ్రేహౌండ్స్ వంటి వ్యవస్థలను గతంలో ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. అవినీతి, భౌతిక నేరాలను నియంత్రించడానికి ఇతర యంత్రాంగాలు ఉన్నాయన్నారు. అయితే ప్రస్తుతం నేరాల స్వభావం మారిపోయిందని ఆయన పేర్కొన్నారు. సైబర్ నేరాలు (Cyber Crimes) వేగంగా పెరుగుతున్నాయని చెప్పారు.

cm revanth 5

Telangana Law and Order | అప్​గ్రేడ్​ చేయాలి

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పోలీసింగ్ వ్యవస్థలను అప్‌గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి అన్నారు. బలమైన సాంకేతిక నైపుణ్యాలు కలిగిన అధికారులను నియమించుకోవాలని సూచించారు. సిబ్బందికి సాంకేతికపై శిక్షణ ఇవ్వాలన్నారు. సామర్థ్యాలను అప్‌గ్రేడ్ చేయకుండా ఆధునిక నేరాలను నిరోధించడం కష్టం అన్నారు. జనాభా అవసరాలకు అనుగుణంగా పోలీస్​ సిబ్బంది నియామకం చేపట్టాలని సూచించారు.

దీనిని కూడా చదవండి : Telangana Sports University | అన్ని సౌకర్యాలతో స్పోర్ట్స్​ యూనివర్సిటీ : సీఎం రేవంత్​రెడ్డి

Revanth Reddy Warning | వారు తీరు మార్చుకోవాలి.. కలెక్టర్లపై సీఎం ఆగ్రహం
Air India Plane Accident | ఎయిరిండియా విమానానికి తప్పిన పెను ప్రమాదం
CS Tenure Extension | సీఎస్​ పదవీకాలం పొడిగింపు.. రిటైర్డ్​ ఐపీఎస్​ సంచలన లేఖ
Jeevan Reddy Resignation | కాంగ్రెస్​కు రాజీనామా చేసిన జీవన్​రెడ్డి.. రేవంత్​రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు
Petrol Shortage Rumors | పెట్రోల్​ కష్టాలు.. బారులు తీరిన వాహనదారులు.. అసలు కారణమిదే?
TAGGED:cyber crime TelanganaHyderabad policing reformsRevanth Reddy speechTelangana governance newsTelangana law and orderTelangana police retreat 2026
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Kamareddy Sports Village | Kamareddy Sports Village | ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ విలేజ్ ఏర్పాటు చేయాలి..: కేంద్ర మంత్రిని కోరిన ఎమ్మెల్యే కేవీఆర్​
Next Article Sand Illegal Transport | ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు : కలెక్టర్​ ఇలా త్రిపాఠి Sand Illegal Transport | ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు : కలెక్టర్​ ఇలా త్రిపాఠి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?