అక్షరటుడే, వెబ్‌డెస్క్: Telangana LPG Supply | రాష్ట్రంలో గ్యాస్ కొరత లేదని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (Minister Uttam Kumar Reddy) అన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. గృహ వినియోగదారులకు సరిపడా గ్యాస్ సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో రాష్ట్రంలో గ్యాస్ కొరత (Gas Shortage) నెలకొందని ప్రచారం కావడంతో ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు. పలువురు అవసరం లేకున్నా.. ముందు జాగ్రత్తగా సిలిండర్లు బుక్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి సచివాలయంలో అధికారులతో సమీక్షించారు. LPG సరఫరా, వేసవి తాగునీటి సన్నద్ధత, 99 రోజుల ప్రజా పలాన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమం అమలుపై చర్చించారు.

Telangana LPG Supply | సరఫరా చేస్తాం
ఎల్పీజీ సిలిండర్లను (LPG Cylinders) బ్లాక్ మార్కెట్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. గృహ వినియోగదారులకు అసౌకర్యం కలిగిస్తే ఉపేక్షించమన్నారు. బ్లాక్ మార్కెట్ జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆస్పత్రులు, ప్రభుత్వ వసతి గృహాలకు అంతరాయం లేకుండా గ్యాస్ సరఫరా చేస్తామని తెలిపారు. ప్రజల్లో అపోహలను తొలగించాలని, వినియోగదారులు ఎటువంటి అసౌకర్యాన్ని ఎదుర్కోకుండా చూసుకోవాలని కలెక్టర్లకు సూచించారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పౌర సరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, నీటిపారుదల ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీధర్, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Godavari Pushkaralu 2027 | గోదావరి పుష్కరాలకు ముందస్తు ఏర్పాట్లు చేయాలి.. మంత్రి కోమటిరెడ్డికి ఎంపీ అర్వింద్ లేఖ

