Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Telangana Nominated Posts | త్వరలో నామినేటెడ్​​ పోస్టుల భర్తీ.. కాంగ్రెస్​ నేతల కీలక భేటీ
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Telangana Nominated Posts | త్వరలో నామినేటెడ్​​ పోస్టుల భర్తీ.. కాంగ్రెస్​ నేతల కీలక భేటీ

తెలంగాణ

Telangana Nominated Posts | త్వరలో నామినేటెడ్​​ పోస్టుల భర్తీ.. కాంగ్రెస్​ నేతల కీలక భేటీ

ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో కాంగ్రెస్‌ కీలక నేతలు భేటీ అయ్యారు. నామినేటెడ్​ పదవుల భర్తీపై చర్చించినట్లు సమాచారం.

Srinivas kolluri
Last updated: మార్చి 20, 2026 7:31 సా.
Srinivas Kolluri
7 రోజులు ago
Share
Telangana Nominated Posts

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Telangana Nominated Posts | రాష్ట్రంలో కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు కావొస్తోంది. కానీ నామినేటెడ్ పదవులను మాత్రం భర్తీ చేయలేదు. దీంతో ఆశావహులు పదవుల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం కాంగ్రెస్​ పెద్దలు సమావేశం అయ్యారు.

Contents
  • Telangana Nominated Posts | ఆశావహుల ప్రయత్నాలు
    • Telangana Nominated Posts | వారికే ప్రాధాన్యం

ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో కాంగ్రెస్‌ కీలక నేతల భేటీ నిర్వహించారు. ఈ సమావేశానికి కాంగ్రెస్​ రాష్ట్ర ఇన్​చార్జి మీనాక్షి నటరాజన్‌ (Meenakshi Natarajan), పీసీసీ అధ్యక్షుడు మహేష్‌గౌడ్‌, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వేం నరేందర్‌ రెడ్డి తదితరులు హాజరు అయ్యారు. వివిధ కార్పొరేషన్​ ఛైర్ పర్సన్​, ఇతర నామినేటెడ్​ పదవుల కోసం ఆశావహుల వివరాలు తీసుకున్నట్లు సమాచారం. కార్పొరేషన్‌ ఛైర్​పర్సన్ (Corporation Chairperson)​ పదవుల భర్తీపై కాంగ్రెస్‌ నేతల చర్చించినట్లు తెలిసింది. దీంతో త్వరలో పదవులు వస్తాయని పలువురు ఎదురు చూస్తున్నారు.

Telangana Nominated Posts | ఆశావహుల ప్రయత్నాలు

రాష్ట్రంలో పదేళ్ల తర్వాత కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చింది. దీంతో చాలా మంది పదవులు ఆశిస్తున్నారు. అయితే అధికారంలోకి వచ్చిన నాటి నుంచి త్వరలో నామినేటెడ్​ పోస్టులను భర్తీ చేస్తామని కాంగ్రెస్ నేతలు ప్రకటనలు చేస్తున్నారు. తప్ప అవి కార్యరూపం దాల్చలేదు. దీంతో ఆశావహులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే రెండున్నరేళ్లు అయిపోయిందని.. ఇంకెప్పుడు భర్తీ చేస్తారని చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్​ నేతలు భేటీ కావడం గమనార్హం. అయితే పదవుల కోసం చాలా మంది ఆశావహులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. తమ జిల్లాల పరిధిలో కీలక నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.

Telangana Nominated Posts | వారికే ప్రాధాన్యం

రాష్ట్రంలో ఇటీవల పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. మున్సిపల్​ ఎన్నికలకు ముందే కార్పొరేషన్​ ఛైర్మన్​ పదవులు భర్తీ చేస్తామని పీసీసీ చీఫ్​ అన్నారు. అయితే ఆశావహులు అధిక సంఖ్యలో ఉండటంతో ఆ ప్రక్రియ ఆలస్యం అయింది. గతంలో కాంగ్రెస్​ జిల్లా అధ్యక్షులను ఆయన నియమించారు. ఇటీవల జిల్లా కమిటీలను సైతం ప్రకటించారు. ఈ క్రమంలో త్వరలోనే నామినేటెడ్​ పదవులు భర్తీ చేయనున్నట్లు సమాచారం.

pcc chief 1

దీనిని కూడా చదవండి : SSC Exams | ఇక పదో తరగతి పరీక్షలు ఉండవు.. సీఎం సంచలన వ్యాఖ్యలు

Telangana Power Demand | రికార్డు స్థాయిలో విద్యుత్​ డిమాండ్​
LPG Supply Review | గ్యాస్ కొరత లేకుండా చర్యలు : సీఎస్​
Kavuri Sambasiva Rao | కేంద్ర మాజీ మంత్రి కావూరు సాంబశివరావు మృతి
Hyderabad Flood Control | నగరంలో వ‌ర‌ద‌ల క‌ట్ట‌డికి చ‌ర్య‌లు : హైడ్రా క‌మిష‌న‌ర్‌
Food Adulteration Raids | కుళ్లిన గుడ్లతో కేక్​ల తయారీ.. బేకరీపై పోలీసుల దాడులు
TAGGED:chairman posts updateCongress leaders meetingnominated posts TelanganaTelangana Congress NewsTelangana Politics
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Alur House Theft | Alur House Theft | ఆలూర్​లో దొంగల బీభత్సం.. పది తులాల బంగారం చోరీ..
Next Article Education Budget Neglect | Education Budget Neglect | విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేసిన రాష్ట్ర బడ్జెట్: టీపీటీఎఫ్​
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?