Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Telangana Pension Scheme | కొత్తగా రెండు లక్షల మందికి పింఛన్లు.. ఇంటర్​ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Telangana Pension Scheme | కొత్తగా రెండు లక్షల మందికి పింఛన్లు.. ఇంటర్​ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం

తెలంగాణతాజా వార్తలు

Telangana Pension Scheme | కొత్తగా రెండు లక్షల మందికి పింఛన్లు.. ఇంటర్​ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం

రాష్ట్రంలో కొత్తగా 2 లక్షల మందికి పింఛన్లు మంజూరు చేస్తామని డిప్యూటీ సీఎం తెలిపారు. దివ్యాంగ విద్యార్థులకు వాహనాలు అందిస్తామన్నారు.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 20, 2026 1:33 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
7 రోజులు ago
Share
Telangana Pension Scheme

అక్షరటుడే, వెబ్​డెస్క్: Telangana Pension Scheme | రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులు, దివ్యాంగులకు గుడ్​ న్యూస్​ చెప్పింది. కొత్తగా రెండు లక్షల మందికి పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించింది.

Contents
  • Telangana Pension Scheme | విద్యార్థులకు అల్పాహారం
    • Telangana Pension Scheme | దివ్యాంగ విద్యార్థులకు వాహనాలు
      • Telangana Pension Scheme | ఆరు గ్యారెంటీలకు నిధులు..

రాష్ట్రంలో అర్హులైన 2 లక్షల మందికి త్వరలో చేయూత పథకంలో భాగంగా త్వరలో పింఛన్లు మంజూరు చేస్తామని డిప్యూటీ సీఎం (Deputy Chief Minister) తెలిపారు. బడ్జెట్​లో ఈ మేరకు కేటాయింపులు చేశామన్నారు. కాగా కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త పింఛన్లు ఇవ్వలేదు. దీంతో ఎంతో మంది దరఖాస్తులు పెండింగ్​లో ఉన్నాయి. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం ప్రకటనతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వితంతువులకు కొత్త పెన్షన్లు మంజూరు కానున్నాయి.

Telangana Pension Scheme | విద్యార్థులకు అల్పాహారం

రాష్ట్రంలో కొత్తగా ఐదు పథకాలు ప్రవేశ పెడుతున్నట్లు డిప్యూటీ సీఎం ప్రకటించారు. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకంతో పాటు విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ పథకం (Breakfast Scheme) అమలు చేస్తామన్నారు. 2026-27 విద్యా సంవత్సరం నుంచి ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులకు వారానికి మూడు రోజులు పాలు, మూడు రోజులు రాగిజావతో కూడిన అల్పాహారం అందిస్తామని తెలిపారు.

Telangana Pension Scheme

Telangana Pension Scheme | దివ్యాంగ విద్యార్థులకు వాహనాలు

ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు కూడా ఇక నుంచి మధ్యాహ్న భోజనం అమలు చేయనున్నారు. సీఎం ఓవర్సిర్స్​ ఎప్లాయిమెంట్ ప్రోగ్రాం కింద రాష్ట్ర యువతకు విదేశాలలో ఉపాధి, భాషా నైపుణ్యాలు, వీసా మార్గదర్శకత్వం అందించనున్నారు. ఇంటర్​ చదువుతున్న దివ్యాంగ విద్యార్థులకు ‘రెట్రో ఫిట్టెడ్ మోటరైజ్డ్’ వాహనాలను పంపిణీ చేస్తామని తెలిపారు.

Telangana Pension Scheme | ఆరు గ్యారెంటీలకు నిధులు..

ఆరు గ్యారెంటీల కోసం బడ్జెట్‌లో రూ.50,713 కోట్లు కేటాయించారు. మూసీ ప్రాజెక్ట్​కు రూ.1500 కోట్లు, యంగ్ ఇండియా స్కూళ్లకు రూ.5 వేల కోట్లు, ఉద్యోగుల హెల్త్ స్కీం కోసం రూ.1,056 కోట్లు, ఉస్మానియా యూనివర్సిటీకి రూ.1,000 కోట్లు ప్రతిపాదించారు. రైతు భరోసాకు రూ.18 వేల కోట్లు, చేయూత పథకానికి రూ.14,861 కోట్లు, ఇందిరమ్మ ఇళ్లకు రూ.5,500 కోట్లు కేటాయిస్తున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు.

ఇది కూడా చదవండి..: Telangana Budget 2026 | రూ.3.24 లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్​

Kuwait Indian Embassy | కువైట్‌లో ఉద్రిక్తత పరిస్థితులు.. భారతీయులకు రాయబార కార్యాలయం కీలక సూచనలు
Gold Pink Paper | బంగారానికి గులాబీ రంగు కాగితం.. ఈ సంప్రదాయం వెనుక ఉన్న రహస్యం తెలుసా!
Krishna River Water | చుక్క నీరు కూడా వదులుకోం : మంత్రి ఉత్తమ్​
Moinabad Drugs Party | డ్రగ్స్​కు నిలయంగా తెలంగాణ.. పెంచిపోషిస్తున్న ప్రజాప్రతినిధులు.. మొయినాబాద్​ ఫామ్​హౌస్​ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి!
Why Air Invisible | మనకు గాలి ఎందుకు కనిపించదో తెలుసా.. దీని వెనుక ఉన్న రహస్యం ఇదే!
TAGGED:budget 2026Deputy Chief Ministerdisability supporteducation programsgovernment benefitssocial welfarestudent meal planTelangana pensionTelangana Pension Schemewelfare schemes
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Health Awareness Nizamabad Health Awareness Nizamabad | ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి
Next Article Digital Health Cards Digital Health Cards | ఉద్యోగులకు డిజిటల్​ హెల్త్​ కార్డులు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?