అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Telangana Power Demand | రాష్ట్ర చరిత్రలోనే ఇవాళ అత్యధిక విద్యుత్ డిమాండ్ నమోదు అయింది. 18,139 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఏర్పడినట్లు అధికారులు తెలిపారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) మాట్లాడుతూ.. 18,139 మెగావాట్ల రికార్డు స్థాయిలో విద్యుత్ డిమాండ్‌ను విజయవంతంగా పూర్తి చేసిందన్నారు. భవిష్యత్ విద్యుత్ అవసరాలను తీర్చడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. తెలంగాణ (Telangana) విద్యుత్ సంస్థలను ఆయన అభినందించారు. మంగళవారం ఉదయం 11:01 గంటలకు నమోదైన 18,139 మెగావాట్ల విద్యుత్ డిమాండ్‌ను ఎటువంటి అంతరాయం లేకుండా రాష్ట్ర విద్యుత్ సంస్థలు తీర్చాయని చెప్పారు.
Telangana Power Demand | వేగవంతమైన వృద్ది
విద్యుత్ డిమాండ్ పెరగడం తెలంగాణ ఆర్థిక వృద్ధి, కార్యాచరణ సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. భౌగోళికంగా చిన్నది అయినప్పటికీ తెలంగాణ పెద్ద రాష్ట్రాల గరిష్ట లోడ్‌లకు సరిపోయే, అధిగమించే స్థాయికి చేరుకుందని పేర్కొన్నారు. ఈ పురోగతి పారిశ్రామిక, వ్యవసాయ, పట్టణ రంగాలలో వేగవంతమైన వృద్ధిని సూచిస్తోందని చెప్పారు.
Telangana Power Demand | గతంలో గరిష్ట విద్యుత్ డిమాండ్
- 2024 మార్చి 8న 15,623 మెగావాట్లు
- 2025 మార్చి 20న 17,162 MW
- 2026 మార్చి 3న 8,139 MW
భవిష్యత్ అవసరాలకు సిద్ధం
తెలంగాణ ప్రస్తుత డిమాండ్‌ను తీర్చడమే కాకుండా ముందస్తు ప్రణాళికతో రాబోయే వేసవి పీక్ అవసరాలకు కూడా పూర్తిగా సిద్ధంగా ఉందని భట్టి విక్రమార్క తెలిపారు. బలమైన గ్రిడ్ వ్యవస్థ, సమన్వయంతో కూడిన కార్యకలాపాలు తమ ప్రభుత్వ బలం అన్నారు.
దీనిని కూడా చదవండి : Telangana Power Demand | భారీగా పెరిగిన విద్యుత్ వినియోగం

