అక్షరటుడే, వెబ్‌డెస్క్: Telangana Power Demand | వేసవి ప్రారంభంలోనే రాష్ట్రంలో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. ఎన్పీడీసీఎల్ పరిధిలో విద్యుత్ డిమాండ్ 6273 మెగావాట్లు చేరుకున్నట్లు సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి (CMD Karnati Varun Reddy) తెలిపారు.
రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. మధ్యాహ్నం పూట ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కూలర్లు, ఏసీల వినియోగం పెరిగింది. ప్రస్తుతం యాసంగి సీజన్ (Yasangi Season)లో వరి పొట్ట, ఈనిక దశలో ఉంది. ఈ సమయంలో పొలాలకు నీరు చాలా అవసరం. ఎండలు మండుతుండటంతో ఆరు తడి పంటకు నీటి అవసరం ఎక్కువగా ఉంది. దీంతో వ్యవసాయ విద్యుత్ వినియోగం సైతం భారీగా పెరిగింది.
Telangana Power Demand | రికార్డు బ్రేక్
ఆదివారం గరిష్ట డిమాండ్ అయిన 6,267 మెగావాట్లు నమోదు కాగా.. నేడు దానిని బ్రేక్ చేస్తూ.. 6,273 మెగావాట్లకు చేరడం గమనార్హం. విద్యుత్ డిమాండ్ పెరుగుదల ప్రధానంగా వేసవి వేడి తీవ్రత కారణంగా ఉందని CMD తెలిపారు. డిమాండ్ భారీగా పెరిగినప్పటికీ, వినియోగదారులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Telangana Power Demand | సన్నద్ధం
వేసవి కాలంలో డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉండటంతో, సంస్థ పూర్తిగా సిద్ధంగా ఉందని సీఎండీ వరుణ్ రెడ్డి పేర్కొన్నారు. సాంకేతిక లోపాలను నివారించడానికి, అన్ని రంగాలలో విద్యుత్ సరఫరా సజావుగా జరిగేలా చర్యలు చేపట్టారు. ఈ మేరకు ఇది వరకే కొత్త సబ్ స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లే ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
ఇది కూడా చదవండి..: Gulf Telugu Advisory | గల్ఫ్‌లో ఉన్న తెలుగు వారికి సీఎం కీలక సూచనలు

