అక్షరటుడే, వెబ్డెస్క్: Telangana Rain Alert | తెలంగాణలోని పలు జిల్లాల్లో బుధవారం రాత్రి భారీ వర్షాలు (Heavy Rains) కురిశాయి. రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, ఆదిలాబాద్, అసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, జనగామ జిల్లాల్లో ఉరుములతో కూడిన గాలి వానలు పడ్డాయి. అలాగే నిజామాబాద్ (Nizamabad), కామారెడ్డి జిల్లాల్లోనూ వాన కురిసింది.
Telangana Rain Alert | ఆసిఫాబాద్ జిల్లాలో అత్యధిక వర్షపాతం
ఆసిఫాబాద్ జిల్లా దహేగావ్ ప్రాంతంలో అత్యధికంగా 75.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. హైదరాబాద్ (Hyderabad) నగరంలో రాత్రి సమయంలో అనేక ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి. షేర్లింగంపల్లి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రాంతంలో 12.5 మిల్లీమీటర్ల వర్షపాతం పడినట్లు అధికారులు తెలిపారు.
Telangana Rain Alert | రానున్న రెండు గంటల్లో వర్షం..
యాదాద్రి-భువనగిరి, జనగామ, హన్మకొండ, వరంగల్, సిద్దిపేట్, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, మెద్చల్-మల్కాజ్‌గిరి, మంచిర్యాల జిల్లాల్లో చెదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే పలు ప్రాంతాలో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
Telangana Rain Alert | హైదరాబాద్‌లో వర్ష సూచన
హైదరాబాద్ నగరంలోని ఆల్వాల్, బాలానగర్, కాప్రా, నేరేడ్మెట్, షేర్లింగంపల్లి ప్రాంతాల్లో తదుపరి ఒకటి నుంచి రెండు గంటల్లో విడివిడిగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Velugumatla Victims Justice | వెలుగుమట్లలో బాధితులందరికీ న్యాయం చేయాలి : కవిత

