అక్షరటుడే, వెబ్డెస్క్ : Telangana Rain Alert | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సోమవారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.
ఉపరిత ఆవర్తన ద్రోణి ప్రభావంతో తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి తేమ గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో వర్షాలు పడుతున్నట్లు అధికారులు తెలిపారు.రాష్ట్రంలో మొన్నటి వరకు ఎండలు మండాయి. అయితే ఆదివారం వాతావరణం (Weather) ఒక్కసారిగా మారిపోయింది. సాయంత్రం నుంచి పలు జిల్లాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. గాలివాన బీభత్సం సృష్టించింది. పలుచోట్ల చెట్లు విరిగిపోగా.. మరికొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. వర్షాలతో వాతావరణం కాస్త చల్లబడింది.
Telangana Rain Alert | ఈ జిల్లాల్లో అలెర్ట్..
తెలంగాణ (Telangana)లోని నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, సిద్దిపేట, సిరిసిల్ల, జనగాం, యాదాద్రి – భువనగిరి, రంగారెడ్డి, ములుగు, భూపాలపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాల్లో సోమవారం వర్షాలు కురిసే అవకాశం ఉంది. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు.కరీంనగర్, హన్మకొండ, వరంగల్, పెద్దపల్లి సైతం వర్ష సూచన ఉంది హైదరాబాద్లో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు అక్కడక్కడ వర్షాలు కురుస్తాయి. రాష్ట్రంలో 45 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. కొన్ని చోట్ల వడగళ్ల వాన సైతం పడే ఛాన్స్ ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ఇది కూడా చదవండి..: Rythu Bharosa Funds | రైతులకు గుడ్న్యూస్.. 22న రైతు భరోసా నిధుల విడుదల

