అక్షరటుడే, వెబ్డెస్క్ : Telangana RC DL Delivery | తెలంగాణలో వాహనదారులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఇకపై డ్రైవింగ్ లైసెన్స్‌లు, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ) కార్డుల కోసం ఆర్టీవో కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. సెంట్రలైజ్డ్ ప్రింటింగ్ మరియు డిస్పాచ్ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
ఈ కీలక నిర్ణయానికి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు రవాణా శాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 61 ఆర్టీవో కార్యాలయాల ద్వారా లైసెన్స్‌లు, ఆర్సీలు ముద్రించి పంపిణీ చేస్తున్నారు. అయితే ఈ ప్రక్రియలో ఆలస్యం జరుగుతుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
Telangana RC DL Delivery | సులభతరం కానున్న ప్రక్రియ
ప్రస్తుతం తెలంగాణ (Telangana)లో ప్రతి సంవత్సరం సుమారు 4.70 లక్షల కొత్త డ్రైవింగ్ లైసెన్స్‌లు జారీ అవుతున్నాయి. అదేవిధంగా దాదాపు 9.90 లక్షల వాహనాలు రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. మొత్తంగా ఏడాదికి 14 నుంచి 15 లక్షల కార్డులు వాహనదారులకు చేరవేయాల్సి వస్తోంది. ఈ కార్డులు చేరేందుకు వారాలు, నెలల సమయం పడుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో అవినీతి నిరోధక శాఖ తనిఖీల్లో అనేక లైసెన్స్‌లు, ఆర్సీలు RCs ఏజెంట్ల వద్ద కనిపించడం కూడా పెద్ద చర్చనీయాంశమైంది.
Telangana RC DL Delivery | కార్డులు ముద్రించి నేరుగా వాహనదారుల ఇంటికి
కొత్త విధానం అమల్లోకి వస్తే, రాష్ట్రవ్యాప్తంగా ఒకే కేంద్రం నుంచి కార్డులు ముద్రించి నేరుగా వాహనదారుల ఇంటికి పంపిస్తారు. మధ్యవర్తులు, ఏజెంట్ల పాత్ర పూర్తిగా తగ్గిపోతుంది. దీంతో పారదర్శకత పెరగడంతో పాటు ప్రజలకు వేగంగా సేవలు అందే అవకాశం ఉంది.లైసెన్స్ లేదా ఆర్సీ కార్డులు ఆలస్యంగా అందకపోవడం వల్ల ట్రాఫిక్ పోలీసులు (Traffic Police), రవాణా శాఖ తనిఖీల్లో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కొత్త విధానం వల్ల ఈ సమస్యలు కూడా గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. రవాణా శాఖ (Transport Department)కు పన్నులు, ఫీజుల రూపంలో ప్రతి సంవత్సరం సుమారు రూ.6,700 నుంచి రూ.6,900 కోట్ల వరకు ఆదాయం వస్తోంది. ఇందులో యూజర్ ఛార్జీలు కూడా పెద్ద మొత్తంలో ఉన్నాయి. ఈ నిధులను సద్వినియోగం చేసి సెంట్రలైజ్డ్ వ్యవస్థను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇది కూడా చదవండి : Bhadrachalam Temple | భద్రాచలం ఆలయ అభివృద్ధికి చర్యలు

